ERRABELLI: 'రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు'

author img

By

Published : Jun 18, 2021, 6:57 PM IST

రామవరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని సూచించారు. జనగామ జిల్లా రామవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో సేవలపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసిన ఘనత ఒక్క కేసీఆర్​ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు. కొవిడ్​ కల్లోలంలోనూ సంక్షేమ పథకాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు వంటి వాటిని ఆపలేదని మంత్రి గుర్తుచేశారు.

ఇదీ చూడండి: CPI NARAYANA: ప్రగతిభవన్​ కోటలు బద్ధలవుతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.