పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : అమిత్‌షా

పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : అమిత్‌షా
Amit Shah Sakala Janula Sankalpa Sabha in Jangaon : పసుపు రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జనగామ జిల్లాలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. అవినీతిలో కేసీఆర్ పాలన అగ్ర స్థానంలో ఉందని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Amit Shah Sakala Janula Sankalpa Sabha in Jangaon : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకులు అందరూ రాష్ట్రంలో బీజేపీ తరుఫున ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తదితర ముఖ్య వ్యక్తులు ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah Meeting at Jangaon) ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా జనగామ జిల్లాలోని సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Amit Shah Telangana Tour : వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్ షా(Amit Shah) గుర్తు చేశారు. ఓవైసీకి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. భైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తామని తెలిపారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), ఎంఐఎం కుటుంబపార్టీలని అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ అని చెప్పారు.
Amit Shah Comments on KCR Government : మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మళ్లీ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. అవినీతిలో కేసీఆర్(KCR) పాలన అగ్ర స్థానంలో ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు.
"పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఫసల్ బీమా అమలు చేస్తాం. పేదలకు వైద్య సాయం కోసం 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి రాష్ట్రం విముక్తి పొందింది. భైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తాం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతాం. వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి "- అమిత్‌షా , కేంద్ర హోం శాఖ మంత్రి
