విద్యుత్​ మోటార్ల ధ్వంసం.. రైతుల ఆవేదన

author img

By

Published : Sep 5, 2021, 7:06 PM IST

farmers motors destroyed at jagtial

గుర్తు తెలియని వ్యక్తులు తమ సాగునీటి మోటార్లను ధ్వంసం చేశారని.. జగిత్యాల జిల్లా పైడిమడుగు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంవత్సర కాలంగా సుమారు 90 వరకు మోటార్లను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగునీటి కోసం ఏర్పాటుచేసుకున్న మోటర్​, పైపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో జరిగింది. గత రాత్రి తమ పొలాల్లోని మోటార్లు, పైపులు, విద్యుత్​ పరికరాలు కొన్నింటిని ధ్వంసం చేశారని.. మరికొన్నింటిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదుచేశారు.

గడిచిన సంవత్సర కాలంగా తమ గ్రామంలో 90 వరకు కరెంటు మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. మోటార్లు ధ్వంసం చేయడం వల్ల.. పంట పొలాలకు సాగునీరందించడం ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. ధ్వంసమైన మోటార్లను పరిశీలించారు. ఎత్తుకెళ్లిన మోటార్ల వివరాలను సేకరించారు.

గుర్తుతెలియని వ్యక్తులు.. రాత్రి వేళ వచ్చి మోటార్లు, పైపులు,ఇతర విద్యుత్​ పరికరాలు పగలకొట్టారు. 11 మోటార్లు, చాలా పైపులను కోసేశారు. ఒక్కక్క మోటారు రేటు రూ.25 నుంచి 30 వేలు ఉంటుంది. సంవత్సర కాలంగా మోటార్లను ఎత్తుకుపోతున్నారు. ఇప్పటికి ఒక్క మోటారు కూడా దొరకలేదు.

- గంగయ్య, బాధిత రైతు

ఇదీచూడండి: బస్సు చక్రాల కింద మహిళ.. రెండు గంటలు నరకయాతన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.