LIVE VIDEO: నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో పడిపోయిన మున్సిపల్​ ఛైర్​పర్సన్..!​

author img

By

Published : Sep 19, 2021, 2:25 PM IST

Updated : Sep 19, 2021, 3:35 PM IST

jagityal-municipal-chairperson-shravani-fell-in-the-pond-in-ganesh-immersion-time

గణేశ్​ నిమజ్జన కార్యక్రమంలో చిన్న అపశ్రుతి దొర్లింది. జగిత్యాలలో నిమజ్జనానికి వెళ్లిన మున్సిపల్​ ఛైర్​పర్సన్​ శ్రావణికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. చెరువు మధ్యలోకి వెళ్లాక.. తెప్ప ఒక వైపు వంగిపోయి ఛైర్​పర్సన్​​ నీటిలో పడిపోయింది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో పడిపోయిన మున్సిపల్​ ఛైర్​పర్సన్..!​

వినాయక నిమజ్జనోత్సవంలో జగిత్యాల మున్సిపల్​ ఛైర్​పర్సన్​ బోగ శ్రావణికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల చింతకుంట చెరువులో వినాయక నిమజ్జనంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు పాలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిమజ్జనాలను ప్రారంభించేందుకు వినాయకుని విగ్రహాన్ని ఓ తెప్పపై చెరువులోని తీసుకెళ్లారు. విగ్రహంతో పాటు మున్సిపల్​ ఛైర్​పర్సన్​ శ్రావణి, కౌన్సిలర్లు కూడా వెళ్లారు. చెరువు మధ్యలోకి వెళ్లాక.. విగ్రహాన్ని నీటిలో వదిలేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తెప్ప ఒక్కసారిగా ఒక వైపు వంగిపోయింది.

తెప్ప మీద ఉన్న వాళ్లలో కొంత మంది చెరువులో పడిపోయారు. ఛైర్‌పర్సన్‌ శ్రావణితో పాటు మహిళ కౌన్సిలర్​ కూడా నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతావారు.. ఛైర్​పర్సన్​ను ఒక్కసారిగా పైకి లాగారు. మరో మహిళా కౌన్సిలర్​ను కూడా కాపాడి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. నిమజ్జనంలో పాల్గొన్ని మిగతావాళ్లు కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విఘ్నేశుని విగ్రహం మాత్రం పడిపోకుండా.. తెప్పపై అలాగే ఉండటం గమనార్హం.

నిమజ్జనాల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని.. మున్సిపల్​ ఛైర్​పర్సన్​ శ్రావణి సూచించారు. తనకు ఎదురైన ఘటనను దృష్టిలో ఉంచుకుని.. జాగ్రత్తగా వ్యవహించాలని కోరారు. తెప్పల మీద ఎక్కువ మంది వెళ్లకుండా.. అన్ని జాగ్రత్తలతోనే చెరువులోకి వెళ్లాలని తెలిపారు.

ఇదీ చూడండి:

Last Updated :Sep 19, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.