Jeevan Reddy on paddy procurement: 'ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి'

author img

By

Published : Nov 19, 2021, 10:36 PM IST

jeevan reddy

రైతు నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయడం అభినందనీయమని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు (jeevan reddy on paddy procurement). ఇది దేశ రైతుల విజయమని.. ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి రైతులకు అండగా నిలవాలని పేర్కొన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్... ప్రజలను దృష్టి మళ్లించేందుకు రైతులపై ప్రేమ ఉన్నట్టు కపటనాటకము ఆడుతున్నారని జీవన్ రెడ్డి (jeevan reddy on paddy procurement) ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కాంగ్రెస్​ నియోజకవర్గ ముఖ్య కార్యక్తల సమావేశానికి జీవన్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దుతు ఇవ్వాలని కోరారు.

రైతు నల్ల చట్టాలను (CENTRES DECISION TO REPEAL THREE FARM LAW) కేంద్రం రద్దు చేయడం ఎంతో శుభపరిణామని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని సూచించారు. కేంద్రం 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు పది లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆరోపించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ఇద్దరు కలిసి ఆటలాడుతూ రైతులను నష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు.

'ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి'

ఇవాళ మోదీ గారు వాస్తవాలు గ్రహించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. రైతులను అభినందిస్తున్నాను. కేవలం భాజపా, తెరాస పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాయి. కేంద్రాన్ని చూసి రాష్ట్ర బుద్ధి తెచ్చుకోవాలి. ధాన్యం కొనుగోలు చేయాలి. వాస్తవాలను గ్రహించి తప్పును సరిదిద్దుకోవడం విజ్ఞత అని చెబుతున్నాను. వరిసాగు చేయొద్దు ఆరుతడి పంటలు పెట్టాలంటే అది ఎలా సాధ్యమవుతుంది. ఇవాళ ఆరుతడి పంటలకు మద్దతు ధర ఎక్కడుంది. అవి గిట్టుబాటు కావాలంటే రైతులకు ప్రోత్సాహం అందించాలి. రాయితీ కల్పించాలి. కేసీఆర్​ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా విజ్ఞత ప్రదర్శించండి. భేషాజాలకు పోకండి. వరికి ప్రత్యామ్నాయంగా చెరకు ఉంటుంది. జగిత్యాలలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. -జీవన్​ రెడ్డి, ఎమ్మెల్సీ.

ఇదీ చూడండి: Revanth reddy on paddy procurement: 'ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.