YS Sharmila : 'ఎక్కడ ఆపారో.. అక్కడి నుంచే మళ్లీ నా పాదయాత్ర'

author img

By

Published : Jan 24, 2023, 2:23 PM IST

YS Sharmila

YS Sharmila Padayatra News : ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా.. రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈనెల 28 నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. పోలీసులు అనుమతివ్వకపోయినా.. ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మొదలెడతానని తెలిపారు.

పాదయాత్రను ఈనెల 28న మళ్లీ ప్రారంభిస్తా

YS Sharmila Padayatra News : ఈనెల 28న పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తానని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు. ఎక్కడ పాదయాత్రను ఆపారో అక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిడులు తెచ్చినా 3,500 కి.మీల పాదయాత్ర పూర్తి చేశానని వెల్లడించారు.

"బీజేపీ మతతత్వ పార్టీ.. దాంతో మాకు సంబంధం లేదు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై, మహిళలపై గౌరవం ఉందా? గవర్నర్ ప్రమాణం చేయిస్తేనే కేసీఆర్‌ సీఎం అయ్యారు. నాకు భయపడే కేసీఆర్‌ ఖమ్మంలో సభ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తాను." - వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

మాజీ మంత్రి వైఎస్​ ‍‌వివేకానందరెడ్డి కేసు విచారణ త్వరగా పూర్తి చేసి, దోషులను శిక్షించాలని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల సీబీఐని కోరారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు ఉండకూడదు అంటూ జవాబిచ్చారు. వై.ఎస్.వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని షర్మిల అన్నారు. వివేకాను అతి దారుణంగా హత్య చేశారని .. కేసు దర్యాప్తు ఇన్నేళ్లు చేస్తే వ్యవస్థపై, సీబీఐపై ప్రజలకు నమ్మకం ఉండదని తెలిపారు. ఇప్పటికైనా వివేకా హత్య కేసును తొందరగా తేల్చండని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.