Teen Crashes Into White House With Truck In America : 'బైడెన్​ను చంపేందుకు.. 6 నెలలు ప్లాన్ చేశా'

author img

By

Published : May 24, 2023, 5:04 PM IST

Updated : May 24, 2023, 7:32 PM IST

Sai Varshith Update News

Teen Crashes into White House With Truck In America : అమెరికాలోని వైట్​హౌస్ పరిసరాల్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. తెలుగు సంతతికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఆ దేశ అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలోని లాఫెట్ స్క్వేర్ వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Teen Crashes into White House With Truck In America : అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడైన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని విచారించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి చూశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Sai Varshith Update News : దీనికి సాయి వర్షిత్ ఆరు నెలలుగా ప్లాన్‌ చేసి మరీ ఘటనకు పాల్పడినట్లు తేలింది. విచారణలో అతడు ఆ విషయాన్ని అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెండ్ వర్గాలు మీడియాకు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. వాటి ప్రకారం.. సాయి వర్షిత్‌ సోమవారం రాత్రి సెయింట్‌ లూయిస్‌ నుంచి వాషింగ్టన్‌లోని డ్యుల్లెస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, ఆ తర్వాత యూ-హాల్ సంస్థ వద్ద ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌ వెలుపల ఉన్న సైడ్‌వాక్‌ వద్దకు వెళ్లాడు.

అతన్ని చంపాలని ఆరు నెలలుగా ప్లాన్ చేశా!: శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీ కొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేస్తూ మరోసారి ఢీ కొట్టాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే సాయి వర్షిత్ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలకు పోలీసులు కంగుతిన్నారు. ఈ దాడి కోసం తాను ఆరు నెలలుగా ప్లాన్‌ చేసినట్లు సాయి వర్షిత్ చెప్పాడు. అలాగే దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్‌బుక్‌లో రాసుకున్నట్లు తెలిపాడు.

Teen Crashes into White House with Truck in US : శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని నిందితుడు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్స్‌ అడగ్గా.. అవసరమైతే బైడెన్‌ను చంపాలనున్నానని చెప్పినట్లు చెప్పారు. లేదా అక్కడున్న వారిలో ఎవరినైనా చంపడమో, గాయపర్చడమో చేయాలనుకున్నానని సాయి వర్షిత్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

సాయి వర్షిత్ మానసిక పరిస్థితిపై పోలీసులు ఆరా..: అతని వద్ద ఉన్న నాజీ జెండాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి ప్రశ్నించగా.. తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు నిందితుడు(సాయి వర్షిత్) చెప్పాడు. హిట్లర్‌ బలమైన నేతని.. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని అతడు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అతని(సాయి వర్షిత్‌) మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వివరాల కోసం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.

అయితే మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో అతను మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి తన గ్రాడ్యుయేషన్​ని పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్‌, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న సాయి వర్షిత్ డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్‌ ప్రొఫైల్‌ ద్వారా తెలిసింది. కాగా ఇప్పటివరకు నిందితుడితపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులుు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :May 24, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.