'ప్రజలు కష్టాల్లో ఉంటే.. కేసీఆర్​ దిల్లీలో ఏం చేస్తున్నారు'

author img

By

Published : Jul 30, 2022, 12:23 PM IST

Updated : Jul 30, 2022, 1:58 PM IST

'వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్​ దిల్లీలో ఏం చేస్తున్నారు'

kishan reddy on musi floods: మూసీకి సంబంధించిన పనులపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు జలమయమైన అంబర్‌పేట్‌లోని ముంపు ప్రాంతాలు, మూసారాంబాగ్ వంతెనను ఆయన పరిశీలించారు.

'ప్రజలు కష్టాల్లో ఉంటే.. కేసీఆర్​ దిల్లీలో ఏం చేస్తున్నారు'

kishan reddy on musi floods: రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే.. 4 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ దిల్లీలో ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రగతిభవన్​ దాటి బయటికి రాని కేసీఆర్​.. ఇప్పుడు దిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లో మూసీ పరివాహకంలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ముసారంబాగ్​ బ్రిడ్జిని పరిశీలించిన ఆయన.. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రాఫిక్స్​తో మభ్యపెట్టింది తప్పితే.. ఒక్క అడుగైనా ముందుకు వేయలేదన్నారు. విపత్తు వేళ ఉపయోగించుకునేందుకు ఎస్డీఆర్​ఎఫ్​ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ట్ర సర్కార్​ విఫలమైందని కిషన్​రెడ్డి విమర్శించారు.

'ఇష్టారాజ్యంగా కొందరు మూసీని ఆక్రమిస్తున్నారు. అందువల్లే ప్రజలకు వరద కష్టాలు. పరీవాహక ప్రాంత అభివృద్ధి అంటూ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గ్రాఫిక్స్​ తప్పితే ఇప్పటికీ ముందడుగు మాత్రం పడలేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లారు. కేసీఆర్​ దిల్లీ పర్యటన ఎందుకో ప్రజలకు వివరించాలి.' -కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

మూసీ ఉద్ధృతితో మూసారాంబాగ్​ బ్రిడ్జి మూసివేత.. ట్రాఫిక్​ ఆంక్షలు అమలు..

నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్​.. త్రుటిలో తప్పించుకున్న బైకర్

Last Updated :Jul 30, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.