మీరు ప్రయాణించాల్సిన ఆర్టీసీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా...?

author img

By

Published : Jan 14, 2023, 6:59 AM IST

Updated : Jan 14, 2023, 8:12 AM IST

Facilities for passengers through TSRTC app

Facilities for passengers through TSRTC app: సంక్రాంతి పండగ వేళ ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీఎస్​ఆర్టీసీ పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సాంకేతికతను వినియోగిస్తుంది. అందులో భాగంగానే ప్రయాణికుల కోసం బస్‌ట్రాకింగ్ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

Facilities for passengers through TSRTC app: ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్​ఆర్టీసీ ఎల్లప్పుడూ ముందుంటుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ముందస్తుగా టికెట్ బుకింగ్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు.. బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశరూపంలో అధికారులు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే బస్సు ఎక్కడుందో.. ఎంత దూరంలో ఉందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్‌ యాప్‌ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవచ్చు.
1800 బస్సులకు ట్రాకింగ్​ సదుపాయం: ప్రస్తుతం ముందుగా రిజర్వేషన్‌ సౌకర్యం గల 18వందల బస్సు సర్వీస్‌లకు ట్రాకింగ్‌ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ సంక్రాంతికి ముందుస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించిన 600 ప్రత్యేక బస్సులకూ ట్రాకింగ్‌ను అనుసంధానం చేసింది. త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లతో పాటు మిగిలిన సర్వీస్‌లన్నింటికీ ఈ సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులకు అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశ రూపంలో పంపిస్తున్నామన్నామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

టీఎస్​ఆర్టీసీ యాప్​ ఎలా పొందాలి: టీఎస్​ఆర్టీసీ బస్​ ట్రాకింగ్ పేరుతోనూ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtc.telangana.gov.in నుంచి సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు తెలపాల్సిన అవసరం లేదని యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌ సిటీతో పాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా సంస్థ పొందుపరిచింది.

ప్రయాణికులకు సహాయం కావాలన్న యాప్​ ద్వారా తెలపవచ్చు: ప్రయాణికులు సమీపంలోని ప్రయాణ ప్రాంగణాలు, సర్వీస్‌ నంబర్‌, బస్సు నంబర్‌లను నమోదు చేసి వివరాలను పొందవచ్చు అని ఆర్టీసీ తెలిపింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్‌ చేసే సదుపాయాన్ని యాప్‌లో కల్పించారు. బస్సు బ్రేక్‌డౌన్‌, ప్రయాణికులకు వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు యాజమాన్యానికి రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని యజమాన్యం తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అత్యాధునిక సౌకర్యాలతో ముందుకు దూసుకెళ్తోంది. భవిష్యత్‌లో మరిన్ని వసతులతో సంస్థకు మెరుగులు దిద్దుతామని నిర్వాహకులు చెబుతున్నారు.

టీఎస్​ఆర్టీసీ యాప్ ద్వారా ప్రయాణికులకు సౌకర్యాలు

ఇవీ చదవండి:

Last Updated :Jan 14, 2023, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.