RTC CHAIRMAN BAJIREDDY: 'ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి పూర్వ వైభవం తెస్తాం..'

author img

By

Published : Sep 20, 2021, 1:35 PM IST

RTC CHAIRMAN BAJIREDDY

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) తప్పకుండా రోజూ రూ. 13నుంచి 14కోట్ల ఆదాయానికి చేరుకుంటుందని ఆ సంస్ధ ఛైర్మన్(RTC CHAIRMAN BAJIREDDY) బాజిరెడ్డి గోవర్దన్​ రెడ్డి స్పష్టం చేశారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యమని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ఛాలెంజ్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్​గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సంస్థ ఆస్తులు ఆమ్మే ప్రస్తకే లేదని ఆర్టీసీ ఛైర్మన్‌(RTC CHAIRMAN BAJIREDDY) బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బస్ భవన్‌లో బాజిరెడ్డి గోవర్దన్... ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆసియాలోనే నెంబర్ వన్‌గా ఉన్న సంస్థ నష్టాల బారిన ఎందుకు పడిందో అధ్యయనం చేస్తున్నామని బాజిరెడ్డి తెలిపారు. రోజూ రూ. 13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ.. కరోనాతో 3 కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకొని 10 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం రైల్వే ఆస్తులను ప్రైవేటుపరం చేస్తోంది. కానీ మేము ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోం. ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే మా ఇద్దరినీ సీఎం కేసీఆర్​ నియమించారు. -బాజిరెడ్డి గోవర్దన్​, ఆర్టీసీ ఛైర్మన్​

సంస్థకు పూర్వ వైభవం తెస్తాం. కరోనా కారణంగా ఆర్టీసీ ఆదాయం తగ్గింది. 100 శాతం సురక్షిత ప్రయాణంతో బస్సులను నడుపుతాం. ఆర్టీసీకి ప్రజల ఆదరణ చాలా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పునఃప్రారంభిస్తాం. -సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

ఆర్టీసీ ఎండీగా నియామకమైన సజ్జనార్‌(MD SAJJANAR) కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని.. తిరిగి ఆర్టీసీ ఆదాయాన్ని రూ. 13 నుంచి 14 కోట్లకు చేరుస్తామని బాజిరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీని ఛాలెంజ్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం విధానం, డీజిల్ ధరలు పెరగడం వల్ల సంస్థకు నష్టాలు వచ్చాయని బాజిరెడ్డి ఆరోపించారు. కరోనా తర్వాత 95శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. ప్రయాణికులకు 95శాతం బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని సజ్జనార్‌ తెలిపారు. ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకే పూర్తిస్థాయి ఎండీని, ఛైర్మన్‌ను నియమించిందని బాజిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, బిగాల గణేష్‌ గుప్తా, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి పూర్వ వైభవం తెస్తాం..

ఇదీ చదవండి: White challenge issue: డ్రగ్స్ వాడట్లేదని స్వచ్ఛందంగా నిరూపించుకుందాం: రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.