ప్రయాణికులకు గుడ్ న్యూస్​​.. సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులు

author img

By

Published : Sep 20, 2022, 10:25 PM IST

TS RTC

TS RTC runs special buses for Dussehra: దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్‌లైన ఎంజీబీఎస్​, జేబీఎస్‌తో నగరంలోని మరిన్ని పాయింట్‌ల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ నెల 24నుంచి అక్టోబర్‌ 5 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

TS RTC runs special buses for Dussehra: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ ఆ​ర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈనెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. నగరంలో ప్రధాన బస్​స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్​లతో పాటు, కూకట్ పల్లి, దిల్​సుక్ నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్​బీనగర్​ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్​​.. దసరా పండుగ కోసం ప్రత్యేక బస్సులు: టీఎస్​ ఆర్టీసీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.