Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM

author img

By

Published : May 14, 2022, 12:55 PM IST

Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • తాగునీటి కొరత ఉండదు

ఐదేళ్లు కరవు వచ్చినా... హైదరాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది ఉండదని మంత్రి కేటీఆర్​ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ వద్ద సుంకిశాల ఇన్​టెక్‌ వెల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందన్నారు. ఓఆర్​ఆర్​ చుట్టూ 159 కిలోమీటర్లు రింగ్‌ మెయిన్‌ వేయాలనుకుంటున్నామన్న కేటీఆర్.. కృష్ణా, గోదావరి నీరు రింగ్‌ మెయిన్‌లో పడితే తాగునీటికి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. 2072 వరకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

  • 5 ఎకరాలు మించొద్దంట..

EWS Reservations: 'ఈడబ్ల్యూఎస్'​ కోటాలో లబ్ధి పొందలేక వేల మంది నిరుద్యోగ యువత అర్హత కోల్పోతున్నారు. వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉంటే ఈడబ్ల్యూఎస్‌కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా.. రెవెన్యూ శాఖ మాత్రం వ్యవసాయ భూమే కొలమానంగా వ్యవహరిస్తోంది. సాగుభూమి 5 ఎకరాలకు మించి ఉంటే ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. ఫలితంగా వేల మంది అభ్యర్థులు రిజర్వేషన్‌ కోల్పోతున్నారు.

  • హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా

CRIMINALS USING KGF WEAPON:కేజీఎఫ్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జనాలను ఆకర్షించింది ఈ చిత్రం. అయితే అందరికి యశ్ యాక్టింగ్ నచ్చితే.. నేరస్థులకు మాత్రం యశ్ ఉపయోగించిన సుత్తి నచ్చిందనుకుంటా. అందుకే దాదాపు హత్యల్లో.. ఈ ఆయుధాన్నే ఎక్కువగా వాడుతున్నారు.

  • కొవిడ్​తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి

ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది జ్వరంతో మరణించారు. మొత్తం మరణాలు 27కు చేరాయి. మరోవైపు.. మొత్తం జ్వరపీడితులు 5 లక్షలు దాటారు. ఈ క్రమంలో కరోనాను దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్​గా పేర్కొన్నారు కిమ్ జోంగ్​ ఉన్​.

  • నా చిలక ఎగిరిపోయింది

Parrot escapes: తాను ప్రేమగా పెంచుకున్న చిలక మోసం చేసి ఎగిరిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దాన్ని ఎలాగైనా వెతికిపెట్టాలని కోరాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు చిలకను వెతకడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

  • మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మళ్లీ తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200కుపైగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.800 మేర పెరిగి రూ.61,485కు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,873 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • దారి విషయంలో గొడవ.. ఒకరు మృతి

దారి విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. కొట్లాటకు, ఆపై కత్తి పోట్లకూ దారి తీసింది. ఈ దారుణ ఘటనలో ఓ నిండు ప్రాణం బలికాగా.. మరో ప్రాణం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

  • ఒక్క పండుతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పోషకాలు గల పండ్లలో అవకాడో ఒకటి. మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఈ ఫలంలో శరీర బరువును తగ్గించే గుణం ఉంటుంది. షుగర్​ వ్యాధిగ్రస్తులపాలిట వరంగా చెప్పవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్​ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. అవకాడోలో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  • ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ

ఐపీఎల్​ 2022లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కోహ్లీ, కగిసో రబాడ ఓ రికార్డు సాధించారు. ఆ వివరాలు..

  • 'నుస్రత్​ జహాన్​​' ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో

తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ, నటి నుస్రత్​ జహాన్.. దేశంలోనే అతికొద్ది అందమైన ఎంపీల్లో ఒకరు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అతి చిన్నవయసుల్లోనే లోక్​సభ ఎంపీగా నియమితులయ్యారు. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఓ సారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై లుక్కేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.