TS Weather Forecast : రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

author img

By

Published : Jan 9, 2022, 8:14 AM IST

Updated : Jan 9, 2022, 1:20 PM IST

TS Weather Forecast, telangana rains

TS Weather Forecast : గత కొన్ని రోజులుగా చలికి గజగజ వణుకుతున్న రాష్ట్ర ప్రజలను వరుణుడు పలకరించనున్నాడు. నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

TS Weather Forecast : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వైపునకు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత కొంతమేర తగ్గింది. ఇన్నాళ్లు చలిపులి పంజా విసరగా.. నేడు.. రేపు వరుణుడు పలకరించబోతున్నాడు.

ఇదీ చదవండి: NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు

Last Updated :Jan 9, 2022, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.