Shaikpet Flyover Opening: కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: కేటీఆర్
Updated on: Jan 1, 2022, 1:58 PM IST

Shaikpet Flyover Opening: కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: కేటీఆర్
Updated on: Jan 1, 2022, 1:58 PM IST
Shaikpet Flyover Opening: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద నగరంలో నిర్మించిన అతి పెద్ద పైవంతెన షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Shaikpet Flyover Opening: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం కింద పెద్దఎత్తున రహదారుల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. నూతన సంవత్సరం కానుకగా షేక్‌పేట్ పైవంతెనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్‌కు పోటీ లేదు
KTR speech at shaikpet flyover inauguration: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణం జరిగిందని కేటీఆర్ అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్న మంత్రి.. ఆరు వేల కోట్లకుపైగా నిధులతో నిర్మాణాలు చేపట్టామని వివరించారు. నగరంలో పెద్దఎత్తున లింక్ రోడ్లు నిర్మించామని.. రీజినల్ రింగ్‌రోడ్‌ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరం కూడా హైదరాబాద్‌కు పోటీ రాదని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉందని మంత్రి అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు.
ఆ రోడ్లను తెరిపించాలి
'కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను తెరిపించాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నా. స్కైవేల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ విషయమై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా భూములు ఇవ్వట్లేదు. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.' కేటీఆర్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
రూ. 335 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి వరకు 2.8 కి.మీ పొడవున 6 లైన్లతో నిర్మితమైంది. నగరంలో పొడవైన పైవంతెనల్లో షేక్‌పేట్ ఫ్లైఓవర్ ఒకటి. ఈ పైవంతెనతో మెహదీపట్నం- హైటెక్ సిటీ మధ్య తీరనున్న ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఇదీ చదవండి: Telangana Governor on Omicron : 'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఆకాంక్ష'
