JPS strike Ended In TS : జేపీఎస్​ల సమ్మె విరమణ.. సోమవారం నుంచి విధులకు హాజరు

author img

By

Published : May 14, 2023, 9:24 AM IST

Junior Panchayat Secretaries strike

Telangana Junior Panchayat Secretaries strike ended : ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేయాలని కోరుతూ గత 16 రోజులుగా జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెను శనివారం రోజున విరమించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో కలిసి చర్చలు జరిపిన జేపీఎస్​లు.. సోమవారం నుంచి విధులకు హాజరవుతామని తెలిపారు.

Telangana Junior Panchayat Secretaries strike ended: ఉద్యోగ రెగ్యూలరైజ్​తో పాటు పలు డిమాండ్ల కోసం ఏప్రిల్​ 28నుంచి సుమారు 16రోజులుగా తెలంగాణ జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎట్టకేలకు విరమించారు. శనివారం మధ్యాహ్నం 12గంటల్లోపు జేపీఎస్​లు విధుల్లో చేరాలని లేకుంటే వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అల్డిమేటం జారీ చేయడంతో కొందరు శనివారం ఉదయం విధులకు హాజరయ్యారు.

Junior Panchayat Secretaries strike ended in Telangana : జేపీఎస్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్​ గౌడ్​ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును కలిసి సుదీర్ఘంగా చర్చించారు. చర్చలలో భాగంగా తాము యథాతథంగా విధులు నిర్వర్తిస్తామని, తమకు తగిన న్యాయం చేయాలని జేపీఎస్​లు మంత్రిని కోరారు. వారి సేవలతోనే పంచాయతీరాజ్​కు 73 అవార్డులు వచ్చినట్లు గుర్తు చేశారు.

Junior Panchayat Secretaries Demands : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని వారు కోరారు. వారి డిమాండ్లను సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.. వెంటనే జేపీఎస్​లు విధుల్లో చేరి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో చర్చలు ఫలించడంతో వారు సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.

‘సీఎం కేసీఆర్​ జేపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మా సేవలతో రాష్ట్రానికి 73పంచాయతీ అవార్డులు తీసుకొచ్చాం. సీఎం కేసీఆర్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సమ్మెను విరమిస్తున్నాం. వారిపై పూర్తి నమ్మకం ఉంది. మా ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారనే భరోసా ఏర్పడింది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పంచాయతీ రాజ్​కు మంచి పేరు తీసుకొస్తాం.- శ్రీకాంత్‌గౌడ్‌, జేపీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు

సీఎస్​ ఆదేశాలతో దిగొచ్చిన జేపీఎస్​లు: మొదట తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని.. తమను బెదిరిస్తే సమ్మె మరింత ఉద్రితం చేస్తామని జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. ఈక్రమంలోనే ప్రభుత్వం వారికి నోటీసుల పేరుతో భయపెట్టింది. గత మంగళవారం నాటికి సమ్మె ముగించాలని లేకుంటే ఉద్యోగాలు నుంచి తీసేస్తామని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.

JPS Regularize Process : దీనిని ఏ మాతం లెక్క చేయని జేపీఎస్​లు సమ్మె విషయంలో వెనుక్కి తగ్గలేదు. ఈ క్రమంలో మరోసారి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. దీంతో కొందరు విధుల్లో జాయిన్​ కాగా మరికొందరు సమ్మెలో ఉన్నారు. అనంతరం మంత్రితో జరిపిన చర్చలు ఫలించడంతో వారు కూడా సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.