అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరణ

author img

By

Published : Sep 23, 2022, 12:17 PM IST

Updated : Sep 23, 2022, 12:45 PM IST

Supreme Court refuses to interfere with TS High Court order in Agrigold case

12:15 September 23

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరణ

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం వెళ్లింది. 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. రూ.6,640 కోట్ల కుంభకోణమని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ వెల్లడించారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లే రాబట్టిందని సుప్రీంకోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిందని వివరించారు.

అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఏలూరు కోర్టుకు వెళ్లాలని డిపాజిటర్లకు సూచించింది. తెలంగాణ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇవీ చూడండి..

జింఖానా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల పంపిణీ.. వారికి మాత్రమే..

'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా.. ఎన్నికలకు గాంధీ కుటుంబం దూరం'

Last Updated :Sep 23, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.