రాష్ట్రంలో 40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

author img

By

Published : Sep 2, 2022, 10:47 AM IST

ఉపాధ్యాయ పురస్కారాలు

State Level Best Teacher Awards 2022: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు మొత్తం 40 మంది ఎంపికయ్యారు. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికి సెప్టెంబర్​5న హైదరాబాద్‌లో పురస్కారాలను అందజేస్తారు.

State Level Best Teacher Awards 2022: రాష్ట్రంలో 2022 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు మొత్తం 40 మంది ఎంపికయ్యారు. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్ల విభాగంలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌/ పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ల విభాగంలో 19 మంది, ఎస్‌జీటీ/టీజీటీలకు సంబంధించి 10 మంది, అధ్యాపకులు/సీనియర్‌ అధ్యాపకుల విభాగంలో ఒకరిని ఎంపిక చేశారు.

వీరితో పాటు ప్రత్యేక విభాగంలో మరో 10 మందికి పురస్కారం వరించింది. వీరందరికి ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పురస్కారాలను అందజేస్తారు. విభాగాల వారీగా ఎంపికైన వారి వివరాలివి..

ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు: టి.మురళి కృష్ణమూర్తి (కౌకూరు ఉన్నత పాఠశాల, మేడ్చల్‌), చకినాల శ్రీనివాస్‌ (సిరిసిల్ల), బి.జమునాదేవి (తిర్మలాపురం, జగిత్యాల జిల్లా), ఓ.చంద్రశేఖర్‌ (జూకల్‌, జయశంకర్‌ జిల్లా), గోపాల్‌సింగ్‌ తిలావత్‌ (ఇంద్రవల్లి, ఆదిలాబాద్‌ జిల్లా), ఎస్‌.సురేశ్‌ (పాచల నడ్కుడ, నిజామాబాద్‌ జిల్లా), వి.రాజేందర్‌ (గానుగుపహాడ్‌, జనగామ జిల్లా), బి.చలపతిరావు (ముస్తికుంట్ల, ఖమ్మం జిల్లా), వనుపాలి నిరంజన్‌ (మణికొండ, రంగారెడ్డి జిల్లా), సూర సతీశ్‌ కుమార్‌ (ప్రిన్సిపాల్‌, సర్వేల్‌ గురుకులం, భువనగిరి జిల్లా)

స్కూల్‌ అసిస్టెంట్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు: డి.సత్యప్రకాశ్‌ (స్టేషన్‌ ఘన్‌పుర్‌, జనగామ జిల్లా), జె.శ్రీనివాస్‌ (మస్కాపుర్‌, నిర్మల్‌), పి.ప్రవీణ్‌కుమార్‌ (చిన్న మల్లారెడ్డి హైస్కూల్‌, కామారెడ్డి జిల్లా), తేజావత్‌ మోహన్‌బాబు (బూర్గంపహాడ్‌, కొత్తగూడెం), ఎ.వెంకన్న (సూర్యాపేట), కన్నం అరుణ (నగునూర్‌, కరీంనగర్‌), సయ్యద్‌ షఫీ (ఖమ్మం), డాక్టర్‌ హజారే శ్రీనివాస్‌ (జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌), కె.రామారావు (చిల్కూర్‌, సూర్యాపేట), సీహెచ్‌.కృష్ణ (బొల్లికుంట, వరంగల్‌), కె.మధుకర్‌ (వేంపల్లి, ఆసిఫాబాద్‌), ఎ.రాజశేఖర్‌ (వర్గల్‌, సిద్దిపేట), గొల్ల వెంకటేష్‌ (మల్దకల్‌, గద్వాల), కె.ధనలక్ష్మి (మోండ్రాయి, వరంగల్‌), కంచర్ల రాజవర్ధన్‌రెడ్డి (నార్కట్‌పల్లి మండలం, నల్గొండ), జి.గిరిజమ్మ (నారాయణపేట), జె.ఎల్లాస్వామి (అనంతపుర్‌, గద్వాల), సీహెచ్‌.భరణీకుమార్‌ (అడ్డగూడూర్‌, భువనగిరి), అంబటి శంకర్‌ (రుద్రాంగి, సిరిసిల్ల)

ఎస్‌జీటీ/టీజీటీలు: జి.చంద్రశేఖర్‌ (దిలావర్‌పూర్‌, నిర్మల్‌), ఎం.వెంకటరెడ్డి (సైదాబాద్‌, హైదరాబాద్‌), పసుల ప్రతాప్‌ (గిమ్మ, ఆదిలాబాద్‌), ఉడావత్‌ లచ్చిరామ్‌ (తెరాట్‌పల్లి, నల్గొండ), కె.ప్రవీణ్‌ (చందపల్లి, పెద్దపల్లి), అచ్చా సుదర్శనం (చెర్లపల్లి, హనుమకొండ), టి.ఓంకార్‌ రాధాకృష్ణ (అంగడి కిస్టాపుర్‌, సిద్దిపేట), కడారి అనిత (చన్నదుపట్ల, నల్గొండ), బి.నర్సయ్య (బస్సాపూర్‌, నిజామాబాద్‌), సీహెచ్‌.రాజిరెడ్డి (గుల్లకోట, జగిత్యాల)
అధ్యాపక విభాగం: డాక్టర్‌ ఎం.రమాదేవి (ప్రభుత్వ బీఈడీ కళాశాల (ఐఏఎస్‌ఈ), మాసబ్‌ట్యాంకు, హైదరాబాద్‌)

ప్రత్యేక విభాగం: బి.శంకర్‌బాబు (బీహెచ్‌ఈఎల్‌, సంగారెడ్డి), జె.శ్రీనివాస్‌రెడ్డి (క్షీరసాగర్‌, సిద్దిపేట), ఎం.రాంప్రసాద్‌ (రంగదంపల్లి, సిద్దిపేట), టి.మధుసూదన్‌రావు (శాంతినికేతన్‌, హైదరాబాద్‌), వరకాల పరమేశ్వర్‌ (ఆదిభట్ల, రంగారెడ్డి), వై.లిల్లిమేరీ (తిమ్మంపేట, జనగామ), టి.సత్యనారాయణరెడ్డి (నర్సింహపురం, సూర్యాపేట), ఎం.వెంకటయ్య (పెన్‌పహడ్‌, సూర్యాపేట), సత్తులాల్‌ (గుండాల, కొత్తగూడెం), సముద్రాల శ్రీదేవి (పటాన్‌చెరు, సంగారెడ్డి).

ఇవీ చదవండి: రుణ యాప్​ నిర్వాహకులకు ఇక ముకుతాడు.. వారిపై ఆ సెక్షన్లు నమోదు

టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.