కానిస్టేబుల్​పై నుంచి వెళ్లిన కారు సీసీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు

author img

By

Published : Aug 28, 2022, 5:32 PM IST

road accident cctv footage

ROAD ACCIDENT CCTV FOOTAGE విధులు ముగించుకొని బైక్​పై వస్తోన్న ఓ కానిస్టేబుల్​ను కారు ఢీ కొట్టింది. అతను కారు కింద పడిపోగా కారు అతనిపై నుంచి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో నిక్షిప్తం అయింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన ఇప్పడు వైరల్​గా మారింది.

ROAD ACCIDENT CCTV FOOTAGE: హైదరాబాద్​లోని ఔటర్ రింగ్ రోడ్​పై విధులు ముగించుకొని తిరుగు ప్రయాణమైన కానిస్టేబుల్ బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగూళూరు ఔటర్ రోడ్ వద్ద బైక్​పై వెళుతున్న వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ రాజును వేగంగా వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి కారు ఢీ కొట్టడంతో, కానిస్టేబుల్​కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని గాయాలతో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్​పై నుంచి వెళ్లిన కారు సీసీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.