LIVE UPDATES : ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
Updated on: Jan 26, 2023, 10:39 AM IST

LIVE UPDATES : ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
Updated on: Jan 26, 2023, 10:39 AM IST
10:13 January 26
ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
- హైదరాబాద్: ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
- ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన సీఎం
- జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు
10:06 January 26
పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్లకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
- సికింద్రాబాద్: అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం
- పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్లకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
09:37 January 26
హైకోర్టు వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్
- శాసనసభలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సభాపతి పోచారం
- హైకోర్టు వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్
09:24 January 26
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
- జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
09:15 January 26
తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు
- హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు
- జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేతలు
08:56 January 26
శాసమండలిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- శాసమండలిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు
- జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత
08:29 January 26
బీఆర్కే భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎస్ శాంతికుమారి
- బీఆర్కే భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎస్ శాంతికుమారి
07:48 January 26
ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్‌ను సన్మానించిన గవర్నర్
- ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్‌ను సన్మానించిన గవర్నర్
- బాలలత, ఆకుల శ్రీజను సన్మానించిన గవర్నర్ తమిళిసై
- పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా ఆనందం: కీరవాణి
- భగవంతుని ఆశీర్వాదం, ప్రజల అభిమానంతోనే పద్మశ్రీ వచ్చింది: కీరవాణి
07:36 January 26
నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం, అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తా: గవర్నర్
- దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టవిటీ ఉంది: గవర్నర్
- ఇటీవలే సికింద్రాబాద్‌కు ప్రధాని వందేభారత్ రైలు కేటాయించారు: గవర్నర్
- రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోంది: గవర్నర్
- గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది: గవర్నర్
- గిరిజనుల్లో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నాం: గవర్నర్
- రాజ్‌భవన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాం: గవర్నర్
- కొత్త భవనాలు నిర్మించటం మాత్రమే అభివృద్ధి కాదు: గవర్నర్
- తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి: గవర్నర్
- తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా: గవర్నర్
- తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం: గవర్నర్
- తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది: గవర్నర్
- కొత్త మందికి నేను నచ్చకపోవచ్చు: గవర్నర్ తమిళిసై
- కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా: గవర్నర్
- తెలంగాణ అభ్యుదయంలో నా పాత్ర ఉంటుంది: గవర్నర్
- నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం, అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తా: గవర్నర్
07:32 January 26
తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది: గవర్నర్ తమిళిసై
- ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై
- ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది: గవర్నర్
- మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారు: గవర్నర్
- రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారు: గవర్నర్
- రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది: గవర్నర్
- తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది: గవర్నర్ తమిళిసై
- శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది: గవర్నర్
- వైద్య, ఐటీరంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది: గవర్నర్
07:28 January 26
ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై
- ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై
- ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది: గవర్నర్
- మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారు: గవర్నర్
- రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారు: గవర్నర్
07:23 January 26
రాజ్‌భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన గవర్నర్
- హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవం
- రాజ్‌భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన గవర్నర్
- సైనికుల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై
- రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు హాజరైన సీఎస్ శాంతి కుమారి
07:03 January 26
అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న గవర్నర్
- సికింద్రాబాద్: అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న గవర్నర్
- పరేడ్ గ్రౌండ్‌లో నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై
- అనంతరం రాజ్ భవన్‌లో జాతీయ పతాకం ఎగురవేయనున్న తమిళిసై
06:17 January 26
రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
- ఇవాళ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవం
- ఉ.7 గం.కు జాతీయ జెండా ఆవిష్కరించనున్న గవర్నర్ తమిళిసై
