హైదరాబాద్​లో జోరు వర్షం.. రోడ్లన్నీ జలమయం..

author img

By

Published : Sep 22, 2022, 2:12 PM IST

Updated : Sep 22, 2022, 3:33 PM IST

హైదరాబాద్

Rain in Hyderabad: అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్​లో జోరు వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Rain in Hyderabad: హైదరాబాద్‌ని ప్రాంతాల్లో దంచికొట్టిన వానకు రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, మాదాపుర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్​లో భారీ వర్షం కురిసింది. వెంగల్‌రావునగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, ముషీరాబాద్, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్​బండ్‌, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పుర్‌ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

జీహెచ్​ఎంసీ అప్రమత్తం: దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, గుడిమల్కాపూర్, మెహదీపట్నం,కార్వాన్, లంగర్​హౌస్‌, జియాగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్, మణికొండ, నార్సింగి,మియాపూర్, చందానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నామా, బార్కస్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. భారీ వానలు కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది.

హైదరాబాద్​లో జోరు వర్షం.. రోడ్లన్నీ జలమయం..

ఇవీ చదవండి: అంచనాలకు మించి అభిమానుల రాక.. జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత..

నెల్లూరు, నిజామాబాద్​లోనూ PFI కలకలం.. ఎందుకీ దాడులు? అమిత్ షా లెక్కేంటి?

Last Updated :Sep 22, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.