రాఘవేంద్రుడి 'ప్రేమలేఖ'లో దర్శకుల సందడి.. మీరూ చూసేయండి..

author img

By

Published : May 21, 2022, 3:49 PM IST

Updated : May 21, 2022, 6:43 PM IST

raghavender rao book release event showreel released

దర్శకేంద్రుడు రాఘవేందరరావు తన సినీ ప్రస్థానంపై రాసిన తొలి పుస్తకాన్ని ఇటీవలే లాంఛనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ 3 నిమిషాల వీడియోను రాఘవేందరరావు బృందం విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

నవ్వులు పూయిస్తున్న 'దర్శకేంద్రుడి' వీడియో.. మీరూ చేసేయండి

తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై దర్శకేంద్రుడు రాఘవేందరరావు రాసిన తొలి పుస్తకం 'నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ'. ఇన్ఫోసిస్ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ సుధామూర్తి చేతుల మీదుగా ఇటీవలే ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రాఘవేందరరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆయన సినిమాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు.

ఆద్యంతం నవ్వులు పూయిస్తూ.. సందడిగా సాగిన ఈ వేడుకకు సంబంధించిన 3 నిమిషాల వీడియోను రాఘవేందరరావు బృందం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను త్వరలోనే అభిమానులతో పంచుకోనున్నట్లు తెలిపింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, లెక్కల మాస్టార్​ సుకుమార్​లు చెరో జట్టుగా ఏర్పడి పుస్తకావిష్కరణ వేడుకను మరింత సరదాగా మలిచారు.

ఇవీ చూడండి..

ప్రశాంత్​నీల్​​ మల్టీవర్స్​.. 'కేజీఎఫ్​ 2' సీక్వెల్స్​గా 'సలార్​', 'ఎన్టీఆర్​ 31'?

విజయ్​తో లిప్‌లాక్!.. నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సమంత

Last Updated :May 21, 2022, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.