'తెలంగాణ కంటే గోవాలోనే ఎక్కువ పథకాలు.. డబుల్​ ఇంజిన్​ సర్కారు ఖాయం'

author img

By

Published : May 12, 2022, 5:03 PM IST

Goa CM Telangana Tou

Goa CM Telangana Tour: డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు మించి అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ అన్నారు. గోవా అన్ని రంగాల్లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా దూసుకెళ్తోందన్న సావంత్‌.. ప్రభుత్వ సాయం ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తున్నామన్నారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Goa CM Telangana Tour: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా సాగుతోందని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రమోద్‌ సావంత్‌.. హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

గోవా వచ్చి చూడండి..: "చివరి వ్యక్తి వరకూ సంక్షేమ పథకాలు అందడమే ప్రధాని మోదీ లక్ష్యం. డబుల్ ఇంజిన్ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రావాలనేదే మా ఆకాంక్ష. ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలుకు కృషి చేస్తున్నాం. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. పర్యాటకులకు కూడా పూర్తి వ్యాక్సిన్ వేయించిన రాష్ట్రం గోవా. మా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో గోవా వచ్చి చూడండి. గోవా తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం." -ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి

వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నాం..: గోవాలో వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు వడ్డీలేని రుణాలు తాము కూడా ఇస్తున్నామని ప్రమోద్​ సావంత్​ అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను అందిస్తున్నామని.. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 14న తెలంగాణకు రాబోతున్నారన్న ఆయన.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గోవా ఎన్నికల్లో బాగా పని చేశారని కొనియాడారు. ఆయూష్ అభివృద్ధి కోసం జైపూర్‌లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును అభినందించారు.

గోవాలో తెలంగాణకు మించి సంక్షేమం అందిస్తున్నాం: ప్రమోద్​ సావంత్​

ఇవీ చదవండి: బండిసంజయ్​కు కేటీఆర్​ స్వీట్​ వార్నింగ్​.. దానికి తోడు మహిళ వీడియో..!

ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు.. ఇకపై శ్రీలంకకు ప్రధాని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.