Passport Services In Hyderabad : పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ
Published: May 23, 2023, 5:14 PM


Passport Services In Hyderabad : పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ
Published: May 23, 2023, 5:14 PM
Passport Services At Post Offices In Hyderabad : పాస్‌పోర్ట్‌ల రద్దీని అధిగమించేందుకు.. ఇక నుంచి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాలు సేవలందించనున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.
Passport Services At Post Offices In Hyderabad : పాస్ పోర్టు సేవలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరింత చేరువ చేసింది. పాస్‌పోర్ట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఆ శాఖ చర్య చేపట్టిందని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాలలో పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 20నుంచే ఆ తపాలా కార్యాలయాల్లో.. తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల నుంచి వస్తున్న అధిక పాస్‌పోర్ట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. తపాలా కార్యాలయాలు పాస్ పోర్టు సేవలను అందిస్తాయని ఆయన ప్రకటించారు.
ఇందుకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంట నుంచి 4.30 గంటల మధ్యలో 700 సాధారణ అపాయింట్మెంట్లు ఇస్తామని పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ప్రతి రోజు అపాయింట్మెంట్లలో 10 నుంచి 15 శాతం కొన్ని కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాలు ఇతర దరఖాస్తు దారునికి ఇబ్బందిగా మారుతోందని ఆందోళన చెందారు. అపాయింట్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అపాయింట్మెంట్ల కోసం దరఖాస్తుదారులు వేచి చూడకుండా త్వరితగతిన సేవలు అందిస్తామని భావించారు. ఇప్పటి వరకు ఉద్యోగ, విద్య, మెడికల్ అవసరాలకు సంబంధించిన పత్రాలు కలిగిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నెల 15 నుంచి 30 వరకు అదనంగా 7150 అపాయింట్మెంట్లు : పాస్ పోర్టుల కోసం అధికంగా దరఖాస్తులు వస్తుండడంతో అపాయింట్మెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఈ రద్దీని అధిగమించేందుకు రోజు వారీ అపాయింట్మెంట్లకు అదనంగా మరో 500 అపాయింట్మెంట్లు ఇవ్వడం ద్వారా.. డిమాండ్‌ను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 12 వరకు 5500 అపాయింట్మెంట్లు అదనంగా ఇచ్చినట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి తెలిపారు. మళ్లీ ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరో 7150 అపాయింట్మెంట్లను అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచన మేరకు హైదరాబాద్ పాస్ పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలో ఉన్న 14 తపాలా కార్యాలయాలలో అపాయింట్ మెంట్లను తీసుకోవచ్చు.
ఇవీ చదవండి :
