అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం: హరీశ్​ రావు

author img

By

Published : Jan 10, 2022, 7:30 PM IST

minister harish rao

Minister Harish Rao on Medical equipments: అత్యాధునిక వైద్య పరికరాలతో ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. అందుకే ప్రజారోగ్యం కోసం సీఎం కేసీఆర్​.. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్​ రావును కలిసిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.. అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి వివరించారు.

Minister Harish Rao on Medical equipments: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్‌, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఇమాముద్దీన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాధిపతి రమేశ్​.. హైదరాబాద్​ అరణ్యభవన్‌లో మంత్రి హరీశ్​ రావును కలిశారు. అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి మంత్రికి వివరించారు.

గత 15 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన క్యాథ్‌ల్యాబ్‌ వల్ల ఇప్పటి వరకు 50 కరోనరీ అంజియోగ్రామ్‌, 3 ఫ్లూరోస్కోపీ వంటి చికిత్సలు అందించినట్లు వైద్యులు మంత్రికి వివరించారు. అంతేకాకుండా గత నెలలో 4 తుంటి మార్పిడి, 2 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు మంత్రికి తెలిపారు. ప్రజలకు అందిస్తున్న చికిత్సలను తెలుసుకున్న మంత్రి.. ఉస్మానియా వైద్యులను అభినందించారు.

ఇదీ చదవండి: Revanth reddy: 'కేంద్రంలోని భాజపా 317 జీవోను ఎందుకు కొట్టివేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.