అధికార పార్టీ లోపాలే అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు

అధికార పార్టీ లోపాలే అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు
Opposition Leaders Election campaign in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పార్టీలన్ని వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. వాడివేడీ మాటలతో ఓటర్ల మనస్సును ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా.. మాది సంక్షేమ ప్రభుత్వమంటూ ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను వేడుకుంటున్నాయి.
Opposition Leaders Election campaign in Telangana : హ్యాట్రిక్ కోసం అధికారపక్షం, ఎలాగైనా పగ్గాలు చేయపట్టాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాక్షేత్రంతో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలతో పాటు.. అధికారపార్టీ లోపాలు ఎత్తిచూపుతూ ముందుకెళ్తున్నాయి. అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ఒక్కటే అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ముషీరాబాద్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన హనుమంతంరావు.. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యావంతుల బాధలు తీరుస్తామని భరోసా ఇచ్చారు.
Congress Leader Madhu Yashki Comments on MLC Kavitha : అంబర్‌పేట్ అభివృద్ధిపై బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే ప్రగల్భాలు పలకడమే తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో కోట్లు కొల్లగొట్టారని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఆరోపించారు. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నకవితపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ గెలుపునకు సోపానాలని సీఎల్పీ నేత మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. తెలంగాణకలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ అన్నారు. చిన్నకోడూరు మండలం సికింద్రాపూర్‌లో ఇంటింటి ప్రచారం చేశారు.
"జాగృతి సంస్థ ద్వారా ఎమ్మెల్సీ కవిత రూ.800 కోట్లు పైన కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చాయి. పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతి ఆరోపణలో అరెస్ట్ చేశారు. తెలంగాణలో మాత్రం జాగృతి సంస్థ ద్వారా జరిగిన అవినీతిపై ఎక్కడా విచారణ లేదు. కాలయాపన చేస్తున్నారు."- మధుయాస్కీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్
Opposition Leaders Road Show in Telangana : కుటుంబ పాలనను అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నిర్మల్ జిల్లా జిల్లా తానూర్ భోస్లే నారాయణ రావు పటేల్ ఓట్లు అభ్యర్థించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని.. భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు పునురద్ధాటించారు. రేగొండ మండలంలోని కొత్తపల్లి, జూబ్లీ నగర్, నారాయణపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. హుజూరాబాద్ వీణవంకలో తల్లి పద్మశ్రీతో కలిసి ప్రణవ్ ప్రచారం చేశారు. టీడీపీ, సీపీఐ నాయకులతో కలిసి వైరాలో రాందాస్ నాయత్‌రోడ్ షోలో చేపట్టారు. తెలంగాణ.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాల్లో భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి పోదెం వీరయ్య విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పేదల సమస్యలు పరిష్కరించేందుకు బాన్సువాడ నియోజకవర్గంలోనే ఉంటానని కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రమాణం చేశారు. జక్రాన్‌పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ అభ్యర్థి భూపతి రెడ్డి.. ప్రచారంలో పాల్గొన్నారు.
Acharya Kodandaram Comments on BRS : క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తూ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ టికెట్ ఆశించి బంగపాటుకు గురై అసంతృప్తితో ఉన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, ఆయన అనుచరులన జానారెడ్డి బుజ్జగించారు. దోపీడీ పాలన అంతం కావాలంటే మార్పు అవసరమని.. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాం(Acharya Kodandaram) కరీంనగర్ హుజూరాబాద్‌లో వ్యాఖ్యానించారు.
Etela Rajender Election Campaign in ManoharaBad : గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్‌లో.. బీజేపీ(BJP) అభ్యర్థి ఈటెల రాజేందర్ పర్యటించారు. పలువురి నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంతో పాటు దుబ్బాక అమిర్దొడ్డి మండలాల్లో ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గోశామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ విస్తృతంగా జనం చెంతకు వెళ్లారు. గౌలిగూడ, కోఠిలో కమలంగుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని అనుచరులతో కలిసి రాజాసింగ్ ఓటు అభ్యర్థించారు. బీజేపీ అడ్డా అంబర్‌పేట్ గడ్డా.. అని ఆ పార్టీ అభ్యర్థి కృష్ణయాదవ్ అన్నారు. ప్రజలు మళ్లీ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
Janasena BJP Election Campaign in Hyderabad : కూకట్‌పల్లి ప్రజల్లో రోజురోజుకు జనసేన(Janasena), బీజేపీ కూటమికి మద్దతు పెరుగుతోందని ప్రేమ్‌కుమార్ అన్నారు. కేపీహెచ్‌బీ సహా పలు కాలనీల్లో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి గణేశ్ ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్నికల వేళ నిజామాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అవినీతి, అక్రమాలపై ఈనెల 13న చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకి బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ఆరోపించారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి కాలనీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేస్తే జగిత్యాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని బీజేపీ అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి ఓటర్లకు హామీ ఇస్తూ ఓట్లు అడిగారు. బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం చేశారు.
