Niranjan reddy about rythu bandhu : 'మిగిలిపోయిన రైతులకు ఒకట్రెండు రోజుల్లో రైతుబంధు'

author img

By

Published : Jan 11, 2022, 9:46 AM IST

Updated : Jan 11, 2022, 10:09 AM IST

Niranjan reddy about rythu bandhu, rythu bandhu funds

Niranjan reddy about rythu bandhu : అర్హలందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బ్యాంకులకు సెలవుల కారణంగా జాప్యం జరుగుతోందని... ఒకటి, రెండు రోజుల్లో అందరి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

Niranjan reddy about rythu bandhu : పెట్టుబడిసాయం కింద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పథకం రైతుబంధు... నగదు జమలో కాస్త జాప్యం జరుగుతోంది. ఇప్పటికే కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాగా... ఇంకాకొందరికి అందలేదు. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో అర్హులందరికీ రైతుబంధు సాయం అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబరు నుంచి ఇవాళ్టి వరకు మధ్యలో 4 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయని తెలిపారు. అందుకే రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో రూ.6008.27 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. 7 ఎకరాలు ఉన్న రైతులందరి ఖాతాలకు రైతుబంధు నిధులు జమయ్యాయని వెల్లడించారు. అర్హుల జాబితాలో ఉండి మిగిలిపోయిన రైతులందరికీ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇదీ చదవండి: Telangana Teachers Protest: 'మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. మమ్మల్ని గోస పెడుతున్నారు'

Last Updated :Jan 11, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.