ఖతార్‌లో ఘనంగా నారా లోకేష్ బర్త్‌డే వేడుకలు.. పాల్గొన్న నారా, నందమూరి అభిమానులు

ఖతార్‌లో ఘనంగా నారా లోకేష్ బర్త్‌డే వేడుకలు.. పాల్గొన్న నారా, నందమూరి అభిమానులు
Naralokesh birthday celebrations in Qatar: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోక్ష్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాజాగా ఖతార్‌లో టీడీపీ ఎన్నారై శాఖ గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Naralokesh birthday celebrations in Qatar: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతార్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హాజరైన సభ్యులందరు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతులతో పాటు నందమూరి, నారా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని వారందరూ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి:
