Rajasingh on GO 317: 'జీవో 317ను వెంటనే సవరించాలి'

Rajasingh on GO 317: 'జీవో 317ను వెంటనే సవరించాలి'
Rajasingh on GO 317: ఉద్యోగస్థులను రాష్ట్ర ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని మండిపడ్డారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
Rajasingh on GO 317: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే సవరించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని పేర్కొన్నారు. సవరించిన జీవో ప్రకారమే బదిలీలు, నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వివిధ మార్గాల ద్వారా వాట్సాప్, ఎస్ఎంఎస్, వివిధ రకాలుగా ఉద్యోగస్థులకు బదిలీలకు సంబంధించిన సమాచారం అందిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.... రేపు కరీంనగర్లో ఉద్యోగులకు సంఘీభావంగా రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 5 గంటల వరకు నిద్రపోకుండా జాగరణ చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:
