సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్
Published on: Jan 24, 2023, 12:09 PM IST |
Updated on: Jan 24, 2023, 12:49 PM IST
Updated on: Jan 24, 2023, 12:49 PM IST

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్
Published on: Jan 24, 2023, 12:09 PM IST |
Updated on: Jan 24, 2023, 12:49 PM IST
Updated on: Jan 24, 2023, 12:49 PM IST
12:05 January 24
ఓబుళాపురం గనులకేసు హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్
ఓబుళాపురం గనులకేసు నుంచి తప్పించాలని హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. నేడు హైకోర్టులో మంత్రి పిటిషన్ వేశారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ను హైకోర్టులో విద్యాశాఖ మంత్రి వేసి.. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై సబితా ఇంద్రారెడ్డి స్టే కోరారు.
ఓఎంసీ పరిణామ క్రమం:
- ఓఎంసీపై ఫిర్యాదులు రావడంతో 2009 ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, లీజు ప్రాంతాల సరిహద్దులు నిర్ణయించే వరకు తవ్వకాలు నిలిపివేసింది.
- ఓఎంసీ అతిక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణల్ని ఏపీప్రభుత్వం ఖండించింది. దాంతో అటవీశాఖ తన ఉత్తర్వుల అమలు నిలిపివేసింది.
- 2009 మేలో స్థానిక మైనింగ్ వ్యాపారి ఒకరు ఓఎంసీ అక్రమాలపై సుప్రీంను ఆశ్రయించారు.
- లీజులను సస్పెండ్ చేయాలని, సరిహద్దులు గుర్తించాలని, దీనికి అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని 2009, నవంబరులో సీఈసీ సిఫార్సు చేసింది. తర్వాత రాష్ట్ర కమిటీ సైతం పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది.
- 2009, డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఓఎంసీ హైకోర్టును ఆశ్రయించగా, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
- దీంతో 2010 ఫిబ్రవరిలో మైనింగ్ నిలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దుచేసింది.
- 2011-13లో కర్ణాటకలోని బళ్లారి పరిధిలో కూడా మైనింగ్ నిలిపేయాలని ఆదేశించింది. కర్ణాటక మైనింగ్ లీజులపై కూడా సీఈసీ పలు నివేదికలు అందజేసింది.
- ఏపీ, కర్ణాటకల సరిహద్దులను నిర్ణయించేందుకు 12 వారాల గడువు నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు 2017 డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది.
- సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయకపోవడంపై 2018లో 2 రాష్ట్రాలను సుప్రీం మందలించింది.
ఇవీ చదవండి:

Loading...