'రైతు బంధుని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు'

author img

By

Published : Jan 10, 2022, 12:33 PM IST

Updated : Jan 10, 2022, 1:31 PM IST

KTR about Rythu bandhu, ktr press meet

KTR about Rythu bandhu : తెరాస అంటే తెలంగాణ రైతు సర్కార్‌ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా రైతుబంధు సంబురాలు జరుగుతున్నాయని... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వివిధ రూపాల్లో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

KTR about Rythu bandhu : KTR about Rythu bandhu : తెరాస అంటే తెలంగాణ రైతు సర్కార్‌ అని తెరాస కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని... 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచారని స్పష్టం చేశారు. రూ.50వేల కోట్లను రైతుల ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని తెలంగాణ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుర్తు చేశారు.

రైతుల క్షేమమే ధ్యేయం..

రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అక్కా చెల్లెళ్లు ఇంటి ముందు ముగ్గులు వేసి సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. అన్నదాతలు ఎద్దుల బండ్లతో ర్యాలీ తీసి.. తమ చేతికొచ్చిన పంటను చూపిస్తూ మద్దతు తెలుపుతున్నారు. వివిధ రూపాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని... కానీ ఇవాళ రాష్ట్రానికి కొంతమంది పర్యాటకులు వచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ విధానాలు... ఇతర పార్టీల ఎన్నికల నినాదాలు అని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు. రైతుబంధు పథకం ద్వారా రూ.50 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించాం. 64 లక్షలమందికిపైగా రైతులు ఈ పెట్టుబడి సాయం పొందారు. భూగర్భజలాలు పెరిగాయి. ఉత్తర తెలంగాణకు ఊపిరి కాళేశ్వరం అయితే... దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి పథకాలు.. కేసీఆర్‌కు రెండు కళ్లు.అంతేకాకుండా భూగర్భ జలాల నిర్వహణపై ఐఏఎస్ శిక్షణ అధికారులకు తెలంగాణ కేంద్రంగా మారింది. పలు జిల్లాల్లో రివర్స్ మైగ్రేషన్ కొనసాగుతోంది. భూమి ధర పెరిగి రైతూ దర్జా గా బతుకుతున్నాడు. ఇవాళ తెరాస అంటే తెలంగాణ రైతు సర్కార్‌.

-మంత్రి కేటీఆర్

అప్పట్లో దయనీయ పరిస్థితి

గతంలో రైతులకు భరోసా కల్పించలేని పరిస్థితులు ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. గత పాలకులు... అన్నం పెట్టిన రైతుకు సున్నంబెట్టారని విమర్శించారు. పాలమూరు నుంచే 15 లక్షలమంది వలస వెళ్లిన దుస్థితి అని... ఉమ్మడి పాలనలో ఎంతమంది పాలకులు మారినా రైతుల పరిస్థితి మారలేదని చెప్పుకొచ్చారు.

గతంలో భూమికి విలువ లేకుండే... రైతుకు బతుకు లేకుండే. కరెంట్ అడిగితే కాల్పులు. గతంలో విత్తనాలు కొనబోతే లాఠీ... పంటలు అమ్మబోతే లూటీ. గతంలో తాగునీటి వ్యవస్థ లేదు.. ప్రాజెక్టులు లేవు. ఇక 10ఎకరాల ఆసామీ కూడా బతుకు దెరువు కోసం పట్నాలకు వచ్చారు. అప్పుడు రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటిది. పంటల దిగుబడిలో చివరిగా ఉండేది. గతంలో చెరువులు తంబాలాలు అయ్యాయి. ఇవాళ గంగాళం అయ్యాయి. నిండుకుండలా మారాయి. చెరువు నిండింది. చేను పండింది.

-మంత్రి కేటీఆర్

ముక్కోటి ధాన్యాల రాష్ట్రం

పలు జిల్లాల్లో వలసలు వెళ్లినవారంతా తిరిగి వస్తున్నారని మంత్రి చెప్పారు. కోటి రతనాల వీణనే కాదు ముక్కోటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రమని పేర్కొన్నారు. అన్నమో రామచంద్ర అనే స్థాయి నుంచి... దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని అన్నారు. ఎఫ్‌సీఐ కూడా కొనలేనంత ధాన్యం మన రాష్ట్రంలోఎఫ్‌సీఐ కూడా కొనలేనంత ధాన్యం రాష్ట్రంలో పండుతోందని... ప్రతిపక్షాల వారుకూడా రైతుబంధు తీసుకుంటున్నారని తెలిపారు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేస్తామని స్పష్టం చేశారు.

రైతుబంధును కాపీ కొట్టి పలు పేర్లతో ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. సమస్యలు అధిగమించి పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేస్తాం. రాష్ట్ర స్థూల ఆదాయంలో సాగు రంగం వాటా 21 శాతానికి పెరిగింది. ఉచిత విద్యుత్ కోసమే రూ.41 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. వ్యవసాయం, అనుబంధ రంగాలపై రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశాం. శ్వేత పత్రాలతో సిద్ధంగా ఉన్నాం.. నల్ల చట్టాలతో కాదు. రాజకీయ పర్యాటకుల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

-మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు: కేటీఆర్

ఇదీ చదవండి: ఏపీలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం

Last Updated :Jan 10, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.