Temperature Increased in Telangana : బీ అలర్ట్‌.. మరో మూడు రోజులు తప్పవు తిప్పలు

author img

By

Published : May 15, 2023, 4:34 PM IST

temperature

Increased daytime temperatures in Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భానుడు భగభగ మండనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే సెగలు కక్కుతున్న సూర్యుని చూసి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

Increased daytime temperatures in Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. రేపటి నుంచి హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండతాకిడి తాళలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

Today Weather Report in Telangana : మూగ జీవాలు సైతం ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాయి. వరంగల్‌ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు. దీంతో నగర వాసులు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లని ద్రవాలను తీసుకొంటున్నారు. వ్యాపారులు వారి రోజు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. జనం సాయంత్రం సమయంలో బయటకు వస్తున్నారని అందువలన రోజువారి గిరాకీ బాగా పడిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి:

  • ఎండ తీవ్రతకు మన శరీరంలో నీరు ఆవిరై పోతుంది. అందువలన ప్రతి ఒక్కరి నీరు అధికంగా తీసుకోవాలి.
  • మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ ఎక్కువుగా తాగాలి. వాటి వలన మన శరీరంలో విటమిన్‌లు, మినరల్స్‌, కార్బోహైడేడ్స్‌ చేరి శరీరం డ్రీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.
  • ఫ్రిజ్‌లోని నీరు తాగకపోవడం ఉత్తమం
  • బయటకు వెళ్లిన వారు ఉదయం 10గంటలకు పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి. మిగతా పనులు సాయంత్రం చూసుకునే విధంగా ప్రణాళిక చేసుకోవాలి.
  • బయటకు వెళ్లినప్పడు మంచి నీళ్ల సీసా తీసుకెళ్లాలి. తలపై టోపీ లేదా స్కార్ఫ్‌ ధరించాలి.

మూగ జీవులపై ప్రేమ చూపండి: ఎండ తీవ్రత ప్రతి ఒక్కరిపై ఒకేలా చూపుతోంది. అందువలన మూగ జీవులు కాపాడుకోవాల్సి బాధ్యత మనపై ఉంది. అవి నోరు తెరచి అడగలేవు కదా.. అందుకే మనమే వాటి దాహాన్ని అర్థం చేసుకొని దాహార్తిని తీర్చాలి. మేడపైనా, మన ఇంటి బాల్కనీలో పక్షులకు నీళ్లు పెట్టేందుకు తగు ఏర్పాటు చేయాలి. చిరు ధాన్యాలు ఆహారంగా పెట్టాలి. వీధులలో వచ్చే పశువులు, శునకాలకు తాగు నీరు అందించాలని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.