'మహిళలపై అలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరం'

author img

By

Published : Nov 19, 2021, 10:41 PM IST

Updated : Nov 19, 2021, 10:49 PM IST

leaders on twitter for babu

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను పలువురు ట్వీటర్ వేదికగా ఖండించారు. వ్యక్తిత్వ హననం సరికాదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. వైకాపా నేతల దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీఎం రమేశ్ ట్వీట్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న..కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యక్తిత్వ హననం సరికాదన్నారు. తాను, తన సోదరి భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామన్నారు. విలువల్లో రాజీ ప్రస్తకే లేదని స్పష్టం చేశారు.

  • Am truly hurt by how Smt Bhuvaneswari is subjected to character assassination. We, as siblings have grown up with values. No way that we will compromise with that.

    — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యక్తిగత దూషణలు బాధాకరం..

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని.., వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

మహిళ వ్యక్తిత్వంపై వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

మహిళ వ్యక్తిత్వంపై వైకాపా వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యడు సీఎం రమేశ్ అన్నారు. వైకాపా నేతల దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.

  • దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి నీచ సంస్కృతికి, దిగజారుడు రాజకీయాలకు దారితీసిన అధికార వైసీపీ పార్టీ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

    - సి.యం.రమేష్ (రాజ్యసభ సభ్యులు) (2/2)

    — Dr. CM Ramesh (@CMRamesh_MP) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరం..

వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ట్వీటర్ వేదికగా వెల్లడించారు.

  • ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానపరచే విధంగా అధికార పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.

    — K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Chandrababu news today: ఇది గౌర‌వ స‌భా.. కౌరవ స‌భా: చంద్రబాబు

Last Updated :Nov 19, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.