rains in hyderabad: హైదరాబాద్​​లో వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయాలు​

author img

By

Published : Nov 21, 2021, 4:00 PM IST

Updated : Nov 21, 2021, 5:44 PM IST

telangana latest weather report

హైదరాబాద్(rains in hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి... వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్​ నిలిచిపోయింది.

హైదరాబాద్(rains in hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ నిలిచిపోయింది. అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, హైదర్‌గూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

కొంతసేపు భారీ వర్షం... మరికొంత సేపు ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై నీరు నిలిచిపోయి వాహన చోదకులు, పాదచారులు సతమతమయ్యారు. రోడ్లపై గుంతల్లో నీరుచేరి ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం కురుస్తున్నంతసేపు మెట్రో రైలు మార్గాల్లో గల వంతెనల కింద వాహన చోదకులు ఉండిపోయారు. మరికొందరు తడుచుకుంటూనే వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు...

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(telangana latest weather ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(hyderabad latest weather report) ప్రకటించింది. కిందిస్థాయి గాలులు రాష్ట్రం వైపునకు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడి... సగటు సముద్ర మట్టానికి సమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'రోడ్డు లేదు.. వంతెన లేదు.. ఇక మేం బతికేదెలా?'

Last Updated :Nov 21, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.