రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

author img

By

Published : Jul 24, 2022, 8:28 PM IST

ktr-birthday-celebrations-in-telangana

KTR BIRTHDAY CELEBRATIONS : తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. విభిన్న రీతుల్లో అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలుచోట్ల సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

KTR BIRTHDAY CELEBRATIONS: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సాన్ని తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో వేడుకలు దూరంగా ఉండాలన్న కేటీఆర్ పిలుపు మేరకు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్​పై రూపొందిచిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం తెరాస విద్యార్థి విభాగం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహబూబాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి గిఫ్ట్​ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రెండు ఏసీలను ఇచ్చారు.

హైదరాబాద్​ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. భద్రాచలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి వెయ్యి విలువైన నిత్యావసరాలు పంపిణీచేశారు. పెద్దపల్లిలో నల్ల ఫౌండేషన్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్​ఛైర్లు పంపిణీ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్.. నిరుపేద కుటుంబాలకు చెందిన 37 మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆవరణలో కేటీఆర్‌కు అభిమానులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డికి చెందిన రామకృష్ణ ఆధ్వర్యంలో.. 40 వేల నాణేలతో 30 అడుగుల కేటీఆర్‌ చిత్రం రూపొందించారు. కరీంనగర్‌ జిల్లా కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో సీతాఫలం విత్తన బంతులతో వినూత్న రీతిలో కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని మోకాళ్లపై చిల్పూరు గుట్ట ఎక్కారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే సునీతామహేందర్ రెడ్డి.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవీ చదవండి: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్​లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

ఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.