భాగ్యనగరంలో సందడిగా పతంగుల పండుగ.. పాల్గొన్న మంత్రి తలసాని

author img

By

Published : Jan 15, 2022, 3:20 PM IST

Kite Festival in Hyderabad

Kite Festival in Hyderabad: భాగ్యనగరంలో పతంగుల పండుగను చిన్నాపెద్ద కలిసి సందడిగా చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Kite Festival in Hyderabad: హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో పతంగుల పండుగ సందడిగా జరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి... గాలిపటాలను ఎగురవేయిస్తున్నారు. పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. పతంగులు ఎగురవేసి సందడి చేశారు.

భాగ్యనగరంలో పతంగుల పండుగ

'చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే పతంగి సంబురాలు జరిగేవి. ఇప్పుడు కాలక్రమేణా వేడుకలు చేసుకోవడం తగ్గిపోయింది. ఇప్పుడు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి ఇలా పతంగులు ఎగురవేస్తూ సందడి చేయడం చాలా బాగుంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి.'

--- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి

బాల్యంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే.... 3 నెలల ముందు నుంచే గాలిపటాలు తయారు చేసుకునేవారమని తలసాని గుర్తుచేసుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు నేర్పించాలని కోరారు. ప్రజలు సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: Kodipandalu 2022: మూడు రోజులుగా కోడిపందెలు.. ఏపీలో కాదండి.. మనదగ్గరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.