భారత్​లో 'ఒమిక్రాన్‌ బీఏ.4' కలకలం.. హైదరాబాద్​లో తొలికేసు నమోదు

author img

By

Published : May 20, 2022, 10:20 AM IST

ఒమిక్రాన్‌

Omicron BA.4 case: ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.4 కేసు హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ వెల్లడించింది.

Omicron BA.4 case: దక్షిణాఫ్రికా.. తదితర దేశాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘బీఏ.4’... భారత్‌లోనూ వెలుగు చూసింది! ఈ వేరియంట్‌ తొలికేసు ఈనెల 9న హైదరాబాద్‌లో నమోదైంది. సౌత్​ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వైద్యుడికి ఈ వెరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) వెల్లడించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు.

దీని తీవ్రత ఎలా ఉండొచ్చు?

దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ ఉద్ధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లలో ‘బీఏ.4’ కూడా ఒకటి. ఇంతకుముందు కొవిడ్‌కు గురైన, రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కంటే ఇది ప్రమాదకారి కాదనీ.. కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్‌ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు.

భారత్‌లో ఇప్పటికే ఒమిక్రాన్‌ ఒకసారి వ్యాపించడం జరిగింది. టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల... బీఏ.4 ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. బీఏ.4 సబ్‌ వేరియంట్‌ వల్ల కొద్ది రోజుల్లో కేసులు పెరగవచ్చు. కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుంది. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు.. ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవు అని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి: Pawan Kalyan: నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.