'ఒమిక్రాన్​ను ఎదుర్కోవడానికి హైదరాబాద్​ అన్ని విధాలుగా సన్నద్ధం'

author img

By

Published : Dec 30, 2021, 2:36 PM IST

Updated : Dec 30, 2021, 6:33 PM IST

hyderabad top in vaccination

Hyd DMHO on Omicron variant: కరోనా టీకా తొలిడోస్‌ 110 శాతానికి మించి పంపిణీ చేసి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచింది. నగరంలో ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో... కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదారాబాద్ డీఎమ్​హెచ్​ఓ డాక్టర్ వెంకట్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

హైదరాబాద్​ డీఎంహెచ్​ఓతో ముఖాముఖి

Hyd DMHO on Omicron variant: హైదరాబాద్​లో వివిధ ప్రాంతాల, భాషల ప్రజలు ఉంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరంపై దృష్టి సారించింది. ప్రభుత్వ సూచనలు, ప్రణాళిక మేరకు వ్యాక్సినేషన్​ ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. దీంతో వ్యాక్సినేషన్​ను 100 శాతానికి పైగా పూర్తి చేశాం. బూస్టర్​ డోసు, చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్​పై ఎలాంటి సందేహం వద్దు. ప్రణాళికకు అనుగుణంగా టీకా ప్రక్రియ పూర్తి చేస్తాం. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఒమిక్రాన్​ నిర్ధరణ అవుతోంది. స్థానికుల్లో ముగ్గురికి మాత్రమే వైరస్​ సోకింది. వారిలో లక్షణాలు ఎక్కువగా కనిపించడం లేదు. బాధితులను ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. నగరంలో మూడో దశ ఉద్ధృతమైనా.. ముందస్తుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్​ సిలిండర్లను అందుబాటులో ఉంచాం. -డా. వెంకట్​, హైదరాబాద్​ డీఎమ్​హెచ్​ఓ

ఇదీ చదవండి: DH srinivas on omicron variant: 'సంక్రాంతి తర్వాత థర్డ్​ వేవ్​.. బీ అలర్ట్​'

Last Updated :Dec 30, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.