ఎన్సీసీ శిక్షణ పొందిన విద్యార్థులు దేశానికి భవిష్యత్ నాయకులని నగర సీపీ అంజనీకుమార్ అభివర్ణించారు. సికింద్రాబాద్ తివోలి గార్డెన్స్‌లో హైదరాబాద్ నగర పోలీసులు... ఎన్సీసీ విద్యార్థులకు భద్రత, రక్షణ, శాంతి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
శాంతి, భద్రతలపై ఎన్సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
By
Published : December 18, 2019 at 1:08 PM IST
క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్సీసీ విద్యార్థులు ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. రక్షణ, భద్రత అనే అంశంపై ఎన్సీసీ విద్యార్థులకు మంగళవారం సికింద్రాబాద్ తివోలి గార్డెన్స్‌లో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలు నెలకొల్పే విషయంలో ఎన్సీసీ విద్యార్థులు తమవంతు కృషి చేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీపీ వివరించారు. డయల్ 100కు ఫోన్ చేసిన 8 నుంచి 10 నిమిషాల్లో సహాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాక్-ఐ యాప్ ద్వారా ఎలాంటి రక్షణ పొందవచ్చు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హాక్ ఐ, డయల్ 100 సేవలను వినియోగించుకునే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.
శాంతి, భద్రతలపై ఎన్సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
Intro:సికింద్రాబాద్ యాంకర్.. ఎన్ సి సి లో శిక్షణ పొందిన విద్యార్థులు దేశానికి సమాజానికి భవిష్యత్తు నాయకులుగా తయారయ్యే అవకాశం ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.. సికింద్రాబాద్ తివోలి గార్డెన్లో హైదరాబాద్ నగర పోలీసులు ఎన్సిసి సంయుక్తంగా ఎన్సిసి విద్యార్థులతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు.. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణకు న్యాయానికి మారుపేరుగా ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారని ఆయన అన్నారు.. సమాజంలో శాంతిభద్రతలు నెలకొల్పే విషయంలో ఎన్సీసీ విద్యార్థులు తమ వంతు కృషి చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. ఎన్ సి సి విద్యార్థులు కృతనిశ్చయంతో మరింత పటిష్టం సాధనతో ముందుకు వెళ్లే విధంగా వారిలో ప్రోత్సాహాన్ని అందించినట్లు తెలిపారు. జపాన్ లోని హీరోషిమా నాగసాకి నగరాలు రెండో ప్రపంచ యుద్ధంలో అణు దాడిలో పూర్తిగా నాశనం అయ్యాయన్నారు.. అయినప్పటికీ జపాన్ చేరుకుని ఇతర అభివృద్ధి చెందడం లో యువత పాత్ర కీలకం గా ఉన్నట్లు మన దేశానికి కూడా ఎన్సిసి వారి పాత్ర అలాంటిది అని చెప్పారు. డయల్ 100 వల్ల 8 నుండి 10 నిమిషాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వారు వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యార్థులకు తెలిపారు.. హాక్-ఐ యాప్ ద్వారా ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా పోలీసు సంరక్షణలో ఉన్న విధంగా ఈ యాప్ గురించిన సమాచారాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు.. హాక్ ఐ మరియు డయల్ హండ్రెడ్ సేవలను వినియోగించుకునే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు..