వ్యవసాయ మేనేజ్మెంట్ డిగ్రీకి క్రేజ్.. 'మేనేజ్'లో పీజీడీఎం చేసిన వారందరికీ జాబ్స్

వ్యవసాయ మేనేజ్మెంట్ డిగ్రీకి క్రేజ్.. 'మేనేజ్'లో పీజీడీఎం చేసిన వారందరికీ జాబ్స్
jobs for MANAGE post graduates : రెండు చేతులా సంపాదించాలంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొలువొక్కటే మార్గం అనుకునేవాళ్లు. ఆకర్షణీయ ప్యాకేజీలు ఆ కొలువులకు మాత్రమే ఉండేవి కూడా. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్ని రంగాల్లోనూ ప్రతిభ ఉంటే చాలు కొలువులు కాళ్ల వద్దకు వస్తున్నాయి. మంచి ప్యాకేజీలు ఇస్తున్నాయి. వ్యవసాయ కోర్సులు పూర్తి చేసినవారికి సాఫ్ట్వేర్ కొలువులకు దీటుగా ప్యాకేజీలతో ఉద్యోగాలొస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’ (మేనేజ్)లో ‘పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్’(పీజీడీఎం) కోర్సు పూర్తిచేసిన 2021-23 బ్యాచ్‌లోని మొత్తం 66 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించాయి.
jobs for MANAGE post graduates : వ్యవసాయ కోర్సులు పూర్తి చేసినవారికి సాఫ్ట్వేర్ కొలువులకు దీటుగా ఆకర్షణీయ ప్యాకేజీలతో ఉద్యోగాలొస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’ (మేనేజ్)లో ‘పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్’(పీజీడీఎం) కోర్సు పూర్తిచేసిన 2021-23 బ్యాచ్‌లోని మొత్తం 66 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించాయి. దేశంలోనే ప్రముఖ కంపెనీలు రిక్రూట్మెంట్లో పాల్గొని వీరికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలిచ్చాయి.
గరిష్ఠంగా ఇద్దరికి ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీ లభించింది. ఐటీసీ, అదానీ క్యాపిటల్, మెక్ డొనాల్డ్స్, కోరమాండల్, బేయర్ క్రాప్‌సైన్సెస్, క్రిసిల్, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ వంటి 27 ప్రముఖ సంస్థలు వీరికి ఉద్యోగాలిచ్చాయని ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర ‘ఈనాడు’కు చెప్పారు. సగటు వేతనం రూ.12.16 లక్షలు లభించిందని ఆయన వివరించారు. వ్యవసాయ వాణిజ్యం ప్రధాన అంశంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్ ర్యాంకుల ఆధారంగా ఈ కోర్సులో సీట్లు కేటాయిస్తారు.
