ETV Bharat / state

How to Prevent Dengue Fever Telugu : మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం

How to Prevent Dengue Fever Telugu : వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటితో జబ్బుల భయం కూడా మొదలైంది. ముఖ్యంగా అందరినీ కలవపరిచే విషయం డెంగీ జ్వరం. చాలావరకు ఇది మామూలుగా తగ్గే జ్వరమైనా.. కొందరికిది ప్రాణాంతకంగానూ మారుతుంది. ప్రస్తుతం డెంగీ 2 రకం వైరస్‌ ఎక్కువగా వస్తోంది. దీంతో రక్తకణాల సంఖ్య పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. మరి డెంగీ జర్వం రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో ఓసారి చూద్దాం..

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 12:18 PM IST

How to Prevent Dengue Fever
Dengue Fever

How to Prevent Dengue Fever Telugu : డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక రోగాలకు దోమలే ప్రధాన కారణం. పది మిల్లీలీటర్ల నీటిలో కూడా డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ పెరుగుతుందని ఎంటమాలజిస్టులు(Entomologists) చెబుతున్నారు. ప్రస్తుతం భాగ్యనగర వ్యాప్తంగా డెంగీ కేసులు(Dengue Cases) పెరుగుతున్నాయి. జ్వరంతో బాధపడే ప్రతి పదిమందిలో ఇద్దరు, ముగ్గురిలో డెంగీ లక్షణాలు(Dengue Fever Symptoms) కనిపిస్తున్నాయి. అయితే పగలు కుట్టే దోమలతోనే ఈ డెంగీ ఎక్కువగా సోకుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా దోమలు పెరగకుండా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Dengue Fever Symptoms : డెంగీ జ్వరం వచ్చిందా.. ఈ లక్షణాలున్నాయా.. ఏం చేయాలంటే..?

డెంగీ దోమలకు అడ్డుకట్ట వేద్దామిలా..

  • ఇళ్లలోని బాల్కనీ, కారిడార్‌లో కుండీలలో మొక్కలు పెంచుతూ.. వాటి కింద ప్లేట్లు లాంటివి వాడుతుంటారు. మనం మొక్కకు పోసే నీళ్లు ఎక్కువ అయితే కిందకి జారి అవి ఈ ప్లేట్‌లో నిల్వ ఉంటాయి. ఇవే ముఖ్యంగా డెంగీ దోమల ఆవాసానికి కీలకమైనవి. అయితే వారంలో ఒక రోజుపాటు ఈ కుండీలలో నీళ్లు నిల్వ లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఇలా చేస్తే.. లార్వా దశలోనే అవి నశిస్తాయి.
  • ఇళ్లలో పాత సామగ్రి ఉంటే ఒక చోట పడెస్తుంటాం. ఇంట్లో చీకటిగా ఉండే ప్రాంతాలు, డోర్‌ కర్టెన్లు వెనక శుభ్రం చేయక వదిలేస్తే.. ఇక్కడే దోమలు తిష్ఠ వేసుకుంటాయి. చీకటి ప్రాంతాల్లో.. కర్టెన్లలో తరచూ శుభ్రం చేసి దోమల స్పేయర్‌ చల్లుతూ ఉండాలి.
  • బస్తీల్లో ఇంటి పక్క నుంచే మురుగు కాల్వలు పారుతుంటాయి. దీంతో వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోతాయి. ఇలా ఉంటే వాటిని మున్సిపల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, లేదంటే వాటి చుట్టూ దోమల మందు పిచికారీ(Mosquito Repellent Spray) చేయించేలా చూడాలి.
  • బస్తీలు, మురికివాడల్లో సంపులు తక్కువగా వస్తాయి. దీంతో రెండు రోజులకోసారి వచ్చే నీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో నిల్వ చేసుకుంటారు. కనీసం వాటికి మూతలు కూడా ఉండవు. డెంగీ దోమలు(Dengue Mosquitoes) ఈ మంచినీటిలో పెరుగుతాయి. నీటి డ్రమ్ములు, బకెట్లపై కచ్చితంగా మూతలు పెట్టాలి. డ్రమ్ములను వారానికి ఒకసారి ఖాళీ చేసి ఎండబెట్టాలి.
  • ఇంటి చుట్టూ ఖాళీ టీ కప్పులు, తాగి పడేసిన బొండాలు, శిథిలావస్థలో పడి ఉన్న వాహనాలు లాంటివి లేకుండా చూసుకోవాలి.
  • పగటి పూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు(Tiger Mosquitoes) తీసుకోవాలి. ఇందుకు రిఫ్లెయింట్‌లు వినియోగించాలి. చేతులు, కాళ్లకు దోమల నివారణ క్రీములు(Mosquito Repellent Creams) పూసుకోవాలి. ఇంట్లో ఉన్నాసరే.. కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
  • మలేరియా, చికెన్‌గున్యా(Chikungunya) లాంటి జ్వరాలు వ్యాప్తిని కలిగించే దోమలు రాత్రి పూట ఎక్కుగా కుడతుంటాయి. వాటి నివారణ కోసం దోమ తెరలు వినియోగించాలి.
  • మూడు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం.. ఒళ్లు నొప్పులు, కడుపులో నొప్పి, బీపీ తగ్గడం, నీరసం, శరీరంపై రాషెస్, రక్తస్రావం లాంటి లక్షణాలు ఉంటే డెంగీగా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Seasonal Diseases : రాష్ట్రంలో వర్షాలు.. సీజనల్‌ వ్యాధుల పట్ల జరంత జాగ్రత్త!

ఒకేరోజు 13వేల మందికి 'వింత జ్వరం'.. భయంతో ఆస్పత్రికి పరుగు.. ప్రభుత్వం అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.