ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా: హైకోర్టు

ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా: హైకోర్టు
High Court fires on Advisors Appointment: ఆంధ్రప్రదేశ్‌లో దేవదాయ శాఖ సలహాదారు, ఉద్యోగుల సలహాదారు నియామాకాలపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని హైకోర్టు వ్యాఖ్యనించింది.
High Court fires on Advisors Appointment: ఆంధ్రప్రదేశ్‌లో దేవదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను.. హైకోర్టు కలిపి విచారణ చేపట్టింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. మెరిట్స్‌పై వాదనలు వినిపిస్తామని ఏజీ ధర్మాసనానికి తెలిపారు.
సలహాదారుల నియామాకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అని ప్రశ్నించింది. అంతేకాకుండా సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని హైకోర్టు వ్యాఖ్యనించింది.
ఇవీ చదవండి :
