Harish Rao On Vaccination: వ్యాక్సినేషన్​లో రికార్డు.. తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ: మంత్రి

author img

By

Published : Jan 13, 2022, 9:06 PM IST

harish rao

Harish Rao On Vaccination: రాష్ట్రంలో కొవిడ్ టీకా డోసులు 5 కోట్లు దాటాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తొలి డోసు వందశాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని వెల్లడించారు. కొవిడ్‌ టీకా డోసులు వేసిన వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

Harish Rao On Vaccination: తొలి డోసు వందశాతం పూర్తిచేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2 డోసుల టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ టీకా డోసులు వేసిన వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

మంత్రి హర్షం

vaccination five crores crossed: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ఐదు కోట్ల మార్కు దాటిందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందులో మొదటి డోసు 2.93 కోట్లు కాగా... రెండో డోసు 2.06 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. బూస్టర్ డోసు 1.09 లక్షల మందికి పైగా తీసుకున్నారని స్పష్టం చేశారు.

వైద్యసిబ్బందికి అభినందనలు

congratulations to medical staff: వైద్య సిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేసినట్లు హరీశ్​ రావు తెలిపారు. ఇవాళ 2,16,538 టీకాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యానికి మించి 103 శాతం మొదటి డోస్, 74 శాతం రెండో డోస్ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్య,ఆరోగ్య సిబ్బందితో పాటు పంచాయతీరాజ్‌, పురపాలక, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు తప్పనిసరిగా తీసుకుని మీ కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా నుంచి రక్షించుకోవాలని సూచించారు. టీకాలు, కొవిడ్‌ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కరోనా బారి నుంచి కాపాడతాయన్న ఆయన... టీకా వేసుకున్నా కూడా మాస్కు విధిగా ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

  • వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందితోపాటు పంచాయతీ,మున్సిపల్,ఇత‌ర శాఖ‌ల సిబ్బందికి అభినంద‌న‌లు.రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని,మీ కుటుంబాన్ని,సమాజాన్ని కరోనా నుండి సంరక్షించండి. 2/2
    #TSFightsCorona

    — Harish Rao Thanneeru (@trsharish) January 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.