పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలో చెత్తను తొలగిస్తుండగా బయటపడిన తుపాకులు..!

author img

By

Published : Oct 21, 2022, 6:10 PM IST

Guns found while clearing garbage

Guns Found Near Public Garden: హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్‌ జూబ్లీహాల్ సమీపంలో తుపాకులు బయటపడిన ఘటన కలకలం సృష్టించింది. చెత్తను తొలగిస్తుండగా.. మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పుపట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Guns Found Near Public Garden: హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్‌ జూబ్లీహాల్ సమీపంలో తుపాకులు బయటపడిన ఘటన కలకలం రేపింది. శాసనమండలి ఉద్యానవన శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో పెరిగిన చెట్లను కత్తిరిస్తున్నారు. అదే విధంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా... ప్లాస్టిక్ కవర్లలలో మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పుపట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తపంచాలు ఎక్కడినుంచి వచ్చాయి...? ఎవరి తెచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.