బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి: గవర్నర్

author img

By

Published : Sep 24, 2022, 12:42 PM IST

Updated : Sep 24, 2022, 2:53 PM IST

గవర్నర్‌ తమిళిసై

Governor distributed Bathukamma sarees: బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని రాజ్​భవన్​లో మహిళా ఉద్యోగులు, సిబ్బందికి చీరలను గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు.

Governor distributed Bathukamma sarees: బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న మహిళల పండుగ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు అద్దం పట్టే బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. బతుకమ్మ రూపంలో గౌరీదేవిని మహిళలు పూజిస్తారని తమిళిసై చెప్పారు.

రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్​భవన్​లో రేపట్నుంచి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి కూడా రేపు అనుమతి ఉంటుందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా ఉద్యోగులు, సిబ్బందికి గవర్నర్ రాజ్​భవన్​లో చీరలు పంపిణీ చేశారు. గత మూడేళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతో పాటు.. సొంత ఖర్చులతో ఉద్యోగులు, సిబ్బందికి చీరలు పంపిణీ చేస్తున్నట్లు తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు.

'బతుకమ్మలో సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి'

బతుకమ్మలో సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో, కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలి. - తమిళిసై, గవర్నర్

ఇవీ చదవండి: ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

కశ్మీర్​ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర.. 73ఏళ్ల వ్యక్తి ప్రయాణం.. వెయ్యి కి.మీ పూర్తి

Last Updated :Sep 24, 2022, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.