'బీ అలర్ట్.. సికింద్రాబాద్‌లో ఆ భవనం ఏక్షణమైనా కూలవచ్చు'

author img

By

Published : Jan 19, 2023, 4:59 PM IST

Updated : Jan 19, 2023, 10:54 PM IST

fire accident at secunderabad Deccan Sports Latest Updates

16:55 January 19

Fire Accident in Shopping Mall

'బీ అలర్ట్.. సికింద్రాబాద్‌లో ఆ భవనం ఏక్షణమైనా కూలవచ్చు'

secunderabad fire accident Updates సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో ఇప్పటికీ మంటలు ఎగసిపడుతున్నాయి. భవనం నలువైపుల నుంచి అగ్నికీలలు ఎగిసిపడగా.. చుట్టూ మొత్తం పొగ అలుముకుంటోంది. ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. భవనంలో ఇంకా ఎవరూ లేరని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇక భవనం మూడు వైపుల నుంచి ఫైరింజన్లతో సిబ్బంది మోహరించారు. 22 ఫైరింజన్లతో మంటలార్పారు. ఎట్టకేలకు మంటలు చల్లారాయి.

మరోవైపు ఈ భవనం ఏక్షణమైనా కూలవచ్చని ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ వెల్లడించారు. ఒకవేళ భవనం కూలినా ఎవరూ ఆందోళన చెందవల్సిన అవసరలేదని తెలిపారు. భవన కులినా.. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఘటనాస్థలికి హోంమంత్రి మహమూద్‌ అలీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియట్లేదన్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాల వల్లే మంటలు.. ఎగిసి పడుతున్నట్లు వెల్లడించారు. 80 శాతం మంటలు తగ్గుముఖం పట్టాయన్నారు. మంటలు మరో గంటలో అదుపులోకి వస్తాయని తెలిపారు. మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మంటలు తగ్గిన తర్వాత ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎగసిపడుతున్న మంటలతో రెస్క్యూ ఆపరేషన్‌ కష్టంగా మారింది. తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురైంది. అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. భవనంలో ఇంకా ఎవరూ లేరని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపేవేశారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదంపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలి వద్ద 5 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.

ఇవీ చూడండి:

Last Updated :Jan 19, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.