Telangana News : టాప్ న్యూస్​ @11AM

author img

By

Published : May 14, 2022, 10:59 AM IST

Telangana News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • అమిత్‌షా జీ.. తెలంగాణకు ఏమిచ్చారో చెబుతారా?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ తెలంగాణకు రానున్న నేపథ్యంలో తెరాస ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ''రూ.3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247కోట్ల సంగతేంటి? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏంటి? భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏం చెబుతారు?

  • ముగ్గురు పోలీసులు మృతి

మధ్యప్రదేశ్​లోని గుణా జిల్లాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరోన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా వెల్లడించారు. అరుదైన జాతికి చెందిన నాలుగు జింకలను కొందరు దుండగులు వేటాడినట్లు అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లినట్లు గుణా ఎస్పీ రాజీవ్​ మిశ్రా తెలిపారు.

  • జ్ఞాన్​వాపీ మసీదు సర్వే షురూ

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ జ్ఞాన్​వాపీ మసీదు సర్వే చేపట్టారు అధికారులు. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. జ్ఞాన్​వాపీ మసీదు, శృంగార్​ గౌరీ ప్రాంగణంలో సర్వే చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశించిన సివిల్​ జడ్డ్ జస్టిస్​​ రవికుమార్​ దివాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని అన్నారు.

  • కొత్త కేసుల కంటే.. కోలుకున్నవారే ఎక్కువ

దేశంలో ఒక్కరోజే 2,858 మందికి వైరస్​ సోకింది. మరో 11 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 99 శాతానికి చేరువైంది. ఒక్కరోజే నమోదైన కేసుల కంటే.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.

  • కొవిడ్​తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి..

ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది జ్వరంతో మరణించారు. మొత్తం మరణాలు 27కు చేరాయి. మరోవైపు.. మొత్తం జ్వరపీడితులు 5 లక్షలు దాటారు. ఈ క్రమంలో కరోనాను దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్​గా పేర్కొన్నారు కిమ్ జోంగ్​ ఉన్​.

  • పెళ్లి వాయిదా.. అడ్వాన్స్‌ తిరిగివ్వని కె.కె.కన్వెన్షన్‌

కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లికి అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఒకరు.. బరువు తగ్గిస్తామంటూ అశాస్త్రీయ పద్ధతులతో ఇబ్బందులకు గురి చేశారంటూ మరొకరు.. ఏసీ మరమ్మతుల్లో టెక్నీషియన్లు చేసిన పొరపాటుతో వేసవి కాలమంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యామంటూ ఇంకొకరు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఆయా కేసుల్లో కమిషన్​ ఆసక్తికర తీర్పులను వెలువరించింది.

  • అప్పగింతలు కాకుండానే నవవధువు ఆత్మహత్య

ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. సాయంత్రానికి చావు డబ్బులు వినిపించాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి వరకు వరుడితో కలిసి స్టెప్పులేసి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

  • ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ

ఐపీఎల్​ 2022లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కోహ్లీ, కగిసో రబాడ ఓ రికార్డు సాధించారు. ఆ వివరాలు..

  • ఆరోజు నటనకు గుడ్​బై చెప్తానన్న సిద్ధార్థ్‌

నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం రానప్పుడు యాక్టింగ్ కెరీర్​కు గుడ్​బై చెబుతానన్నారు. ఇక వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. కెరీర్​లో ముందుకెళ్తోన్న కథానాయకుడు విక్రమ్‌ మరో రెండు కొత్త ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టినట్లు తెలుస్తోంది.

  • ఈమె డేట్స్‌ కోసం స్టార్​ హీరోలు క్యూ!

అమెరికా నుంచి అలా అడుగుపెట్టిందో లేదో.. నిహారికకి 'కేజీఎఫ్‌ హీరో యష్‌తో పనిచేస్తారా?' అని ఫోన్‌! నెల తిరక్కుండానే మళ్లీ అదే ప్రశ్న. ఈసారి అవకాశం మహేశ్‌బాబుతో! అజయ్‌ దేవగణ్‌, షాహిద్‌ కపూర్‌.. ఆమె డేట్స్‌ కోసం ప్రయత్నించినవారే. హీరోయిన్‌ కోసం అనుకుంటున్నారా? కాదండీ.. ఒక్కటీ.. ఒకే ఒక్క రీల్‌లో ఆమెతో పనిచేయడానికి ఇదంతా! అంత గొప్పేంటి ఆమెలో అంటారా? అయితే చదివేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.