Telangana News : టాప్ న్యూస్​ @11AM

author img

By

Published : May 13, 2022, 10:59 AM IST

Telangana News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఒక్కరోజే వెయ్యి మందికి కరోనా

India Corona Cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగానే నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 2,841 మందికి వైరస్​ సోకింది. మరో 9 మంది మరణించారు. కొత్త కేసుల్లో దిల్లీలోనే వెయ్యికిపైగా ఉండటం గమనార్హం.

  • ఆ దేశంలోధరలు ఒక్కసారే ట్రిపుల్

ఇరాన్ ప్రజల నెత్తిన ధరల పిడుగు పడింది. వంట నూనె, పాలు, గుడ్లు, చికెన్ వంటి నిత్యావసరాల ధరల్ని ఒక్కసారిగా 300% పెంచింది అక్కడి ప్రభుత్వం. ప్రజల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఈ నిర్ణయం.. దేశంలో అనిశ్చితికి దారితీయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మరణించిన ఘటన ఏపీలోని కాకినాడ జిల్లా సర్పవరంలో చోటుచేసుకుంది. అయితే ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మిగితా విషయాలు తెలియనున్నాయి.

  • ప్రతి 10 కుటుంబాలకు 17 మందే పిల్లలు..

పూర్వం గంపెడు సంతానం ఉండంట గొప్ప.. తర్వాత అది ఇద్దరు, ముగ్గురు వరకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక్కరే చాలు అనే దగ్గరి ఆగిపోతుంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 ప్రకారం రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పద్ధతులను 94% మంది మహిళలు పాటిస్తున్నారు. దీని ప్రభావం తల్లుల ఆరోగ్యంపై కనిపిస్తోంది. ఈ కేటగిరీలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉంది.

  • ఇంటర్‌బోర్డు తీవ్ర నిర్లక్ష్యం

ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఇంటర్‌బోర్డు ఈసారి తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు స్పష్టమవుతోంది. ఇంటర్‌ పరీక్షల సందర్భంగా బోర్డు దోషాలు దొర్లుతూనే ఉన్నాయి.

  • తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు

ఈసారి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే పలకరించే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల 5 నుంచి 8 మధ్య నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి విస్తరిస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • బీటెక్ మధ్యలోనే వదిలేసి

చిన్నప్పటి నుంచి కంప్యూటర్, అంతర్జాలంపై ఎంతో ఆసక్తి పెంచుకుని పెద్దయ్యాక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాడు. చదువుపై ఆసక్తి లేక బీటెక్‌ను మధ్యలోనే వదిలేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు తెలివితేటలను ఉపయోగించుకున్నాడు. పేమేంట్ గేట్ వే సర్వర్‌ను హ్యాక్ చేసిన యువకుడు చివరకు సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయాడు.

  • రూ. 700 తగ్గిన బంగారం ధర

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700లకుపైగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,575 మేర తగ్గి రూ.60,685గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,130గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • 5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​

స్టాక్​ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్​ పడింది. వారాంతపు సెషన్​లో దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350పాయింట్లకుపైగా పెరిగి.. 53 వేల 300 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో.. 16 వేలకు చేరువలో ఉంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు షేర్లన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్లలో లాభాలకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లన్నీ దాదాపు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

  • 2.5 కోట్ల మంది ఫాలోవర్స్​కు శిల్పా శెట్టి షాక్​

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే శిల్పాశెట్టికి ఇన్​స్టాగ్రాంలో 2.54కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరీ షాక్​ ఇస్తూ ఈ యోగా సుందరి అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్​ ఇస్తున్నట్లు చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.