ఉప్పల్‌ టీ20 మ్యాచ్‌కు వెళ్తున్నారా... అయితే ఈ విషయాలు మీకోసమే!

author img

By

Published : Sep 23, 2022, 5:08 PM IST

uppal stadium

Cp mahesh baghawath on ind vs aus t20 భారత్‌ ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరగనుంది. దీనికి సంబందించిన సెక్యూరిటీ, భద్రతా ఏర్పాట్ల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ముఖ్యంగా మ్యాచ్‌కు వెళ్లేవారు ఈ విషయాలను తెలుసుకోవాలి.

Cp mahesh baghawath on ind vs aus t20 భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎల్లుండి మ్యాచ్‌ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీపీ... మ్యాచ్‌ చూసేందుకు దాదాపు 40 వేల మందికి పైగా వస్తారని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు స్థలం కేటాయించామన్నారు. మ్యాచ్‌ రోజున మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని వివరించారు.

మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. 2,500పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 40 వేల మంది వరకు అభిమానులు రావొచ్చు. ఆదివారం ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రాత్రి ఒంటిగంట వరకు మెట్రో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరాం. 300 సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటర్‌ చేస్తున్నాం. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశాం. సాయంత్రం 4 నుంచే స్టేడియం లోపలికి అనుమతిస్తాం. - సీపీ మహేశ్ భగవత్

మ్యాచ్ నిర్వహణ కోసం.. పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ వెల్లడించారు. దాదాపు 2,500 మంది పోలీసులు బంద్ బస్త్‌లో ఉంటారని తెలిపారు. రేపు సాయంత్రానికి హైదరాబాద్‌కు ఆటగాళ్లు చేరుకుంటారని సీపీ చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటిలిజెన్స్ సెక్యూరిటీతో పాటు సిటీ పోలీసులతో ప్లేయర్స్‌కు భద్రత కల్పిస్తామన్నారు. గ్రౌండ్‌లో కూర్చున్న ప్రతి వ్యక్తి కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.

మ్యాచ్‌కు అనుమతి ఉండే పరికరాలు... మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు మొబైల్, హెడ్ ఫోన్స్ అనుమతి ఉందని సీపీ ప్రకటించారు.

అనుమతి లేని పరికరాలు... వీడియో కెమెరా, లాప్‌ట్యాప్‌, సిగరెట్స్‌, లైటర్స్, ఆయుధాలు, మద్యం, నీళ్ల బాటిల్స్‌, హెల్మెట్‌, ఫైర్‌ క్రాకర్స్‌, బ్యాగ్స్‌, సెల్ఫీ స్టిక్స్‌, మాదక ద్రవ్యాలు ఇతర పరికరాలు అనుమతి లేదని తెలిపారు.

మ్యాచ్‌కు వెళ్లే వారికోసం కొన్ని వివరాలు..

  • అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్
  • సాయంత్రం 4 గంటలకు అభిమానులకు స్టేడియంలోకి ఎంట్రీ
  • జేబు దొంగల కోసం ప్రత్యేక నిఘా
  • గ్రౌండ్‌లో పలు సదుపాయల కల్పన
  • అందుబాటులో ఫైర్ సిబ్బంది
  • మెడికల్ సిబ్బందితో పాటు ఏడు అంబులెన్సులు
  • అందుబాటులో స్నేక్ క్యాచర్స్‌

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.