రాష్ట్రంలో కొత్తగా 2,398 కరోనా కేసులు, ముగ్గురు మృతి

author img

By

Published : Jan 14, 2022, 7:29 PM IST

Updated : Jan 14, 2022, 7:51 PM IST

రాష్ట్రంలో కొత్తగా 2,398 కరోనా కేసులు, ముగ్గురు మృతి

19:28 January 14

రాష్ట్రంలో కొత్తగా 2,398 కరోనా కేసులు, ముగ్గురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 2,398 కరోనా కేసులు, ముగ్గురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 2,398 కరోనా కేసులు, ముగ్గురు మృతి

telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,398 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,05,199కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,052కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,676 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,233 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.35 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.

కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 315 మంది మరణించారు. 1,09,345 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 36,582,129
  • మొత్తం మరణాలు: 4,85,350
  • యాక్టివ్ కేసులు: 12,72,073
  • మొత్తం కోలుకున్నవారు: 3,48,24,706

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,86,254 మందికి కరోనా సోకింది. 7,606 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,08,96,639కి చేరగా.. మరణాలు 55,39,078కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,06,493 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1,969 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 65,236,475 దాటింది.
  • ఫ్రాన్స్​లో బుధవారం ఒక్కరోజే 3,05,322 కేసులు వెలుగుచూశాయి. మరో 225 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 1,09,133 మంది వైరస్ బారిన పడ్డారు.​ 335 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,84,615 కొత్త కేసులు బయటపడగా.. 316 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,59,161 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 112 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:

Last Updated :Jan 14, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.