టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం- ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం- ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Congress Case on Minister KTR : రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.
Congress Case on Minister KTR : ఎన్నికల సమయంలో అధికార భవనాలను వాడుకుని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(Minister KTR)పై ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోని టీహబ్‌లో యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని.. ఎన్నికల ప్రచారం కోసం టీహబ్‌ను వాడుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో (Telangana State Election CEO) ఫిర్యాదు చేసింది. అధికార హోదాను దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేసింది.
KTR Goreti Venkanna Interview in Martyrs Memorial Complex : మరోవైపు అమరవీరుల స్మారకం ప్రాంగణంలో ఇటీవల కేటీఆర్, గోరెటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు(Case on KTR Goreti Venkanna Interview) చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెందిన భవనంలో ఇంటర్వ్యూ నిర్వహించారని.. కాంగ్రెస్ నాయకుడు నిరంజన్(Congress Leader Niranjan) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఓ వికాస్‌రాజ్(Vikash Raj) ఈ ఫిర్యాదును హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఈ ఫిర్యాదు చేరగా.. పరిశీలించారు. అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి సైఫాబాద్ పోలీసులకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తులో అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తించారు.
CONGRESS Case on Minister KTR : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేసినందుకు నిర్వహకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రదేశంలో ఇంటర్వ్యూతో పాటు డ్రోన్ ఎగురవేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో డ్రోన్ ఎగురవేసిన నిర్వాహకుడు ఎవరనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వ సంస్థలను వారి కార్యకలాపాల కోసం వినియోగించుకోరాదని పోలీసులు తెలిపారు.
